అమరావతి : పవన్ ఏమాత్రం ఊహించని దాడి

Vijaya






జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రులు ఊహించని రీతిలో మాటలతో దాడులు చేస్తున్నారు. మూడు రాజధానుల కాన్సెప్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తు పవన్ కొన్ని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను ఆధారం చేసుకుని మంత్రులు రోజా, అంబటి రాంబాబు, దాటిశెట్టి రాజా, అమర్ నాధ్ ఒక్కసారిగా  రెచ్చిపోయారు. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15వ తేదీన విశాఖపట్నంలో ప్రజాగర్జన సభను జేసీ నిర్వహిస్తోంది.



ఇదే విషయమై పవన్ స్పందిస్తు తన ట్విట్టర్లో ఎందుకీ గర్జన అంటు చాలా ప్రశ్నలను జగన్ కు సంధించారు. నిజానికి ఆ ప్రశ్నల్లో చాలావరకు ఎందుకీ పనికిరానివే ఉన్నాయి. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఎందుకు ఉండాలి ? అనే విషయమై పవన్ సరైన వివరణ ఇవ్వాలి. లేదా మూడు రాజధానులను తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అనే విషయంపైన అయినా జనాలకు సమాధానం చెప్పాలి. రెండూ కాకుండా ఎందుకీ గర్జన అని ట్విట్టర్లో అడగటమే దండగ మారి వ్యవహారం.




దాంతో పవన్ ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తు పిల్లకి ఏమి తెలుసు సింహాల గర్జన అంటు అంటుకున్నారు. చంద్రబాబునాయుడు నుండి ప్యాకేజీ అందినట్లుంది అందుకనే మ్యావ్ మ్యావ్ అంటు పిల్లి అరుపులు మొదలయ్యాయని ఎద్దేవాచేశారు. ప్యాకేజీ కోసం మొరిగేవాళ్ళకు ఏమర్ధమవుతాయి తమ గర్జనలు అంటు గట్టిగా తగులుకున్నారు.




రోజుకో వేషం వేసి పూటకో మాట మాట్లాడితే జనాలు వెంటపడి కొడతారని మంత్రులు ఘాటుగా స్పందించారు. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కు మూడు రాజధానులంటే మాస్కో, ముంబాయ్, హైదరాబాద్ మాత్రమే అంటు ఎద్దేవాచేశారు. మొత్తానికి పవన్ను దత్తపుత్రుడిగాను, చంద్రబాబు దత్తతండ్రిగాను మంత్రులు పెద్ద ముద్ర వేసేశారు. తాను ఏమి మాట్లాడితే ఏమవుతుందో అన్న భయంతోనే చంద్రబాబు నోరిప్పటంలేదు. బహుశా చంద్రబాబుకు బదులుగానే పవన్ మాట్లాడుతున్నారనే భావనను మంత్రులు జనాల్లోకి బాగా తీసుకెళిపోయారు. మరి తాజాగా మంత్రుల మాటలదాడికి పవన్ ఏమని సమాధానం చెబుతారోర చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: