అమరావతి : చంద్రబాబులో ‘భీమ్లా’ ఉత్సాహం
ఇక విషయంలోకి వస్తే భీమ్లా సినిమా వ్యవహారంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోందంటు చంద్రబాబు రెచ్చిపోయారు. భీమ్లా సినిమా రిలీజ్ చేయద్దని గాని రిలీజును కూడా ప్రభుత్వం ఎక్కడా అడ్డుకోలేదు. కానీ తన హయాంలో రామ్ గోపాలవర్మ తీసిన రెండు సినిమాలను అసలు రిలీజే కానీకుండా అడ్డుకున్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు.
వినోదం పంచే రంగాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందంటు చంద్రబాబు ఆరోపించటమే విచిత్రం. రెవిన్యు ఉద్యోగులను థియేటర్ల దగ్గర కాపలా పెట్టడం అభ్యంతరకరమంటు మండిపడ్డారు. అయితే థియేటర్లు రెవిన్యు యంత్రాంగం పరిధిలోకే వస్తాయి కాబట్టి రెవిన్యు వారినే కాపలా పెట్టింది ప్రభుత్వం. భీమ్లానాయక్ సినిమాపై కక్షసాధింపులో జగన్ బిజీగా ఉన్నారంటు ఎద్దేవా చేశారు. సరే ఇదంతా చంద్రబాబు ఎందుకు చేశారంటే సినిమాకు బంపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టే అని తెలిసిపోతోంది.
అదే సినియాకు యావరేజ్ అని కానీ లేదా ఫెయిల్యూర్ అని కానీ టాక్ వచ్చుంటే చంద్రబాబు అసలు పట్టించుకునేవారే కాదు. ఇక లోకేష్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. సినిమాను చూడాలనే ఉత్సహాన్ని కూడా బయటపెట్టుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతల్లో మాత్రం సినిమా వివాదంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అసలు సినిమా టికెట్ల యవ్వారంలోకి ప్రభుత్వం అనవసరంగా వేలు పెట్టిందనే అబిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా నిబంధనల ప్రకారమే టికెట్లు అమ్మే అవకాశాలు ఇప్పటికైతే తక్కువే. అలాంటిది అనవసరంగా జోక్యం చేసుకుని లేని చెత్తను నెత్తినేసుకోవటం ఎందుకనే ప్రశ్నే వినిపిస్తోంది.