మేము తగ్గేదే లేదని.…2024 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని బిజేపి ఎమ్.పి జి.వి.ఎల్. నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ లో ప్రజాగ్రహ సభ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని... బీజేపీ అంటే లెక్కలేని తనంగా ఉన్న పార్టీలకు నిన్నటి సభ మేలు కొలుపు అని వెల్లడించారు జి.వి.ఎల్. నరసింహ రావు. ఆయా పార్టీ లకు ఓ రకంగా భయం కలిగేలా సభ జరిగిందని... రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరే కత ఏ స్థాయిలో ఉందో నిన్నటి సభతో తేటతెల్లమైందని చెప్పా రు జి.వి.ఎల్. నరసింహరావు.
టీడీపి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పా ర్టీ— రెండు పార్టీల నేతల గుండె ల్లో రైళ్లు పరుగె డుతున్నాయ ని... వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ స్వార్థం దాగి ఉందని చెప్పారు జి.వి.ఎల్. నరసింహరావు. రాష్ట్ర ప్రభు త్వం పట్ల ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు జి.వి.ఎల్. నరసింహరావు. సజ్జల రామ కృష్ణ రెడ్డి….మీ పరిస్థితి గల్లంతు అని అర్థం చేసుకోండి.. వైఎస్సా ర్సీపీ పతనం ప్రారంభమైందని వెల్లడించారు జి.వి.ఎల్. నరసింహరావు.
అవినీతి ఎత్తి చూపడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం పట్టుకుందని... అవినీతి తోలుతిసే పార్టీ బిజేపి అని ఓ రేం జ్ లో నిప్పులు చెరిగారు జి.వి.ఎల్. నరసింహరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లే కార్యక్రమం విరమించుకోకపోతే ఇంకా తీవ్రంగా ఉంటామన్నారు జి.వి.ఎల్. నరసింహరావు. మీ ఆట కట్టిస్తుంది బిజేపి. మీ కుట్ర రాజకీయాలు ఇక నడవవని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు జి.వి.ఎల్. నరసింహరావు. ఎవరెన్ని పన్నాగాలు పన్నినా.. భారతీయ జనతా పార్టీ అన్ని ఎత్తులను చిత్తు చేస్తుందని హెచ్చరించారు జీవీఎల్ నర్సింహ రావు. అధికారం వచ్చే దిశగా పనిచేస్తామన్నారు.