జగనోరి ముందడుగు : టీడీపీలో వారంతా ఇక ఇంటికే!
రానున్న ఎన్నికల నేపథ్యంలో (అవి ముందస్తు ఎన్నికలు అయినా, కాకపోయినా) క్రియాశీల రాజకీయాల నుంచి పలువురు తప్పుకోనున్నారు. వీరిలో గతంలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన వారు ఉన్నారు. వీరు ఉత్తరాంధ్ర రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసిన వారే! ఈ కోవలో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఉన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కళా వెంకట్రావు గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత వైసీపీ ప్రభంజనం కారణంగా గొర్లె కిరణ్ చేతిలో ఓడిపోయారు. తాను తప్పుకున్నాక తన స్థానంలో యాక్టివ్ రోల్ ను ప్లే చేయడానికి కుమారుడే సమర్థుడు అని భావిస్తూ, రాం మల్లిక్ నాయుడును తెరపైకి తీసుకువచ్చారు.
కానీ కొన్ని చోట్ల ఆయనను క్యాడర్ అంగీకరించడం లేదు. ఇందులో భాగంగానే వివాదాలు వస్తున్నాయి. కాపు సామాజిక వర్గా నికి చెందిన కళా వెంకట్రావు ఎన్టీఆర్ హయాం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈయన బంధువు కిమిడి మృణాళిని శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ గా, తరువాత చంద్రబాబు హయాంలో చీపురుపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం రాజకీయాల్లో ఈ కుటుంంబానికి మంచి పేరుంది. ఇదే కోవలో ఎర్రన్నాయుడు స్నేహితుడు గౌతు శ్యాం సుందర శివాజీ కూడా ఉన్నారు. ఆయన స్థానంలో కుమార్తె గౌతు శిరీష రాజకీయ రంగంలో ఉన్నారు. వారసురాలి రాక ఏనాడో జరిగిపోయినా అల్లుడు తలనొప్పుడు ఎప్పటి నుంచో శివాజీని వేధిస్తున్నాయి. పలాస రాజకీయాల్లో వెంకన్న చౌదరి వివాదాస్ప దంగా ఉన్నారు. శివాజీ అల్లుడ్ని అన్న నెపంతో ఆయన గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ తగాదాల్లో తలదూర్చి, మామకు చెడ్డ పేరు తెచ్చారు. అధినేత చంద్రబాబు సైతం ఆయనను నిలువరించ లేకపోయారు అన్న విమర్శ ఒకటి ఉంది.