ఏపీని కేంద్రమే ఆదుకుంది
కాంగ్రెస్ హయాంలో డిల్లీ చుట్టూ కాంట్రాక్టర్ లు , దళారులు తిరిగేవారు...ఇప్పుడు అన్నీ నేరుగా ప్రజలకే ఆ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. భారత దేశాన్ని అభివృద్ధి పధంలో పరుగులు తీయిస్తున్నారని...వాజపేయ్, మోడీ హయాంలోనే దేశం మొత్తం జాతీయ రహదారులు రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. అన్ని పట్టణాలు, నగరాలు, ఆలయాలను కలుపుతూ రోడ్ల అభివృద్ధి చేశారని...పేదల కోసం మోడీ గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. గతంలో చంద్రబాబు, నేడు జగన్ ఉన్నా.. ఎపి కి లక్షల ఇళ్లు నిర్మించారన్నారు. దేశంలో యనభై కోట్ల మందికి మూడు రూపాయలు బియ్యం అందిస్తున్నారని...కేజీ కి 37 రూపాయలుకు కొని, సబ్సిడీ కి మూడు రూపాయలకు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చి రూపాయికి సరఫరా చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో పేదల కొసం పూర్తి ఉచితంగా బియ్యం మోడీ ఇచ్చారని..
కరోనా బారిన పడకుండా వ్యాక్సిన్ ను మోడీ అందుబాటు లోకి తెచ్చారన్నారు. ఇతర దేశాలు మనకు వ్యాక్సిన్ సరఫరా చేయకపోయినా... మనమే తయారు చేసుకున్నామని తెలిపారు. వ్యాక్సిన్ తయారీ కేంద్రాలకు మోడీ స్వయంగా వెళ్లి వారిని ప్రోత్సహించారన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఈ విధంగా పరిశోధనా కేంద్రాలకు వెళ్లారా ? అని ప్రశ్నించారు. కరోనాకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసిన ఘనత మోడీదేనని...మోడీ ప్రధాని కాకుంటే...దేశం ఎలా ఉండేదో ఆలోచన చేయండి అని పేర్కొన్నారు. కార్యకర్తగా పార్టీ కోసం పని చేస్తూ మోడీ ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. మోడీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని...వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీ లను నమ్మొద్దన్నారు.