ఏసీలో ఉంటున్నారా.. అయితే ఇలా చేయండి.. లేదా కరోనా కష్టాలు తప్పవు : డబ్ల్యూహెచ్వో
కేవలం ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రమే కాదు ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని సూచిస్తున్నారు. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని అలా అయితేనే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యం అవుతుంది అంటూ సూచిస్తున్నారు ఎంతోమంది. ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మాస్క్ ధరించడం పై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఏసీ కార్లు ఏసీ గదులలో ఎక్కువ మంది జనాలు అలవాటు పడిన నేపథ్యంలో ఇలా ఏసీ గదుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
కరోనా కట్టడి పై మాస్కులు ధరించే అంశంపై ఇటీవల కీలక సూచనలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఏసీ కారులు ఏసీ గదుల్లో ఉండే వాళ్ళు తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఏసీ గదుల్లో ఉన్న వారు గాలి ద్వారా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని అందుకే తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని సూచించింది. లేనిపక్షంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు మీదికి వచ్చే అవకాశం ఉంది అంటూ హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతేకాకుండా బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి అని సూచించింది.