భర్తను అమాయకున్ని చేసి ప్రియుడితో రాసలీలలు.. కానీ కరోనా నిజం బయటపెట్టింది..?
వివరాల్లోకి వెళితే.. పిలిభిత్ సమీపంలోని దామ్ గర్ గ్రామానికి చెందిన వ్యక్తికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా ప్రస్తుతం సదరు వ్యక్తి ముంబైలో ఉంటున్నాడు. గ్రామంలో ఒక ఫామ్ హౌస్ కొనుగోలు చేయగా ఆ ఫామ్ హౌస్ లో భార్య ఉంటుంది. ఇక భర్త అప్పుడప్పుడు భార్య దగ్గరికి వచ్చి వెళుతుంటాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే భర్త కుమారుడు దూరంగా ఉండడంతో ఒంటరిగా ఉన్న మహిళకు సందీప్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రతిరోజు ప్రియుడుతో ఫామ్ హౌస్ లో రాసలీలల్లో మునిగితేలుతూ ఉండేది సదరు మహిళ. ఈ క్రమంలోనే తనకు ఆస్ట్రేలియాలో ప్రియుడితో విహార యాత్రకు వెళ్ళాలి అనే కోరిక కలిగింది. ఈ క్రమంలోనే జనవరి 6వ తేదీన ఆస్ట్రేలియా విహార యాత్రకు వెళ్లారు. అప్పటివరకు అంతా రహస్యంగానే ఉంది కానీ ఆ తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ అమలు కావడంతో అక్కడే ఇరుక్కుపోయారు. దీంతో వీరి గుట్టు రట్టయ్యింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన భర్త భార్య కనిపించకపోవడంతో కంగారుపడి స్థానికులను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పోలీస్ స్టేషన్ కు చేరుకుని భార్య అతని ప్రియుడిపై ఫిర్యాదు చేసాడు భర్త. తనను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.