ఏప్రిల్ 9వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా పై చర్చించనున్న ప్రముఖులు..!
బెన్నెట్ యూనివర్సిటీ లో భాగమైన 'ది టైమ్స్ స్కూల్ అఫ్ మీడియా' ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9:30 వరకు నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో మీడియా, వైద్య, పబ్లిక్ పాలసీ, టెక్నాలజీ రంగాలలో తల పండిన ప్రముఖులు కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న పోరాటాల గురించి, తమ అనుభవాల గురించి మాట్లాడనున్నారు. ఓ ఇండియన్ యూనివర్సిటీ కరోనా మహమ్మారి పై చర్చా కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ 'గ్లోబల్ ఆన్ లైన్ కాన్ఫరెన్స్ ఆన్ కోవిడ్ 19: సంక్షోభం, భవిష్యత్తు'.
భారతీయ, అంతర్జాతీయ ప్రముఖ నిపుణులు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు కోవిడ్19 వ్యాధి నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చర్చిస్తారు. సాయంత్రం 4గంటల నుండి 9:30 వరకు జరగనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆరు సెషన్స్ ఉండగా... మూడు థీమ్స్/నేపథ్యాల/విషయాల పై చర్చించడం జరుగుతుంది.
థీమ్ I: 4:30 నుండి 5:30 వరకు కరోనా వైరస్ కారణంగా కుదేలవుతున్న ఆర్థిక సంక్షోభం నుండి దేశంలో ఎలా పుంజుకుంటుందో అనే విషయంపై డాక్టర్ అరవింద్ విర్మణి, కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్ధిక సలహాదారు, ఐఎంఎఫ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.అరవింద్ వీర్‌మణి, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ప్రధాని ఆర్ధిక సలహా మండలిలో మాజీ సభ్యుడు ప్రొఫెసర్ మాట్లాడనున్నారు.
థీమ్ II(సెషన్ I) 5:40 నుండి 6:40 వరకు కరోనా వైరస్ వ్యాప్తి ని అదుపులోకి తెచ్చేందుకు చైనా దేశం ఎటువంటి చర్యలను చేపడుతుందో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఇండియా-చైనా స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంజూన్ జంగ్ వివరంగా తెలపనున్నారు. అనంతరం ఇటలీ చెందిన యూనివర్సిటీ ఆఫ్ బోలోగ్నా ప్రొఫెసర్ డాక్టర్ బీయట్రిస్ గెలిలీ తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో వివరించనున్నారు.
థీమ్ II(సెషన్ II) 8 గంటల నుండి 9 గంటల వరకు హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ ప్రొఫెసర్ అషిష్ కుమార్ ఝా కరోనా వైరస్ ప్రభావం అమెరికాలో నివసించే ప్రజలపై ఎలా ఉందో తెలుపుతారు. మాజీ ఆయుష్మాన్ భారత్ డిప్యూటీ సీఈఓ, మాజీ కేరళ హెల్త్ సెక్రటరీ, ప్రస్తుత జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అధికారి అయిన డాక్టర్ దినేష్ అరోరా తో పాటు నారాయణ హస్పటల్స్ చైర్మన్ డాక్టర్ దేవిశెట్టి కూడా అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉందో చెబుతారు.
థీమ్ III: కరోనా వైరస్ గురించి దుష్ప్రచారాన్ని, కుట్రపూరిత విధానాలను ఎలా అరికట్టాలో ఓఎస్ఐఎన్‌టీ ఎక్సపర్ట్ ఎగోన్ స్వీనే, రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టడీ ఆఫ్ జర్నలిజమ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాస్‌ముస్ కెల్సై నీల్సన్, స్వీడన్ అల్ట్ న్యూస్ సైన్స్ న్యూరోసైంటిస్ట్ ఎడిటర్ డా.సుమాయా షైక్, గూగుల్ న్యూస్ ల్యాబ్ లీడర్ ఏపీఎసీ-సింగ్‌పూర్ విభాగం ప్రతినిధి ఇరేనా జాయ్ ల్యూ 6:50 నుండి 7:50 వరకు వివరించనున్నారు.
ఈ కాన్ఫరెన్స్ యొక్క ముగింపు ప్రసంగాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ఇస్తారని తెలుస్తుంది.