అమెరికాను టెన్షన్ పెట్టేస్తున్న చిట్టెలుక

Vijaya
ఏమాలోచించుకుని ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులైమానీని అమెరికా హతమార్చిందో తెలీదు. కానీ హతమార్చిన తర్వాత మాత్రం జరుగుతున్న పరిణామాలతో అమెరికా టెన్షన్ పడుతున్నట్లే కనిపిస్తోంది. అమెరికాలోని కీల స్ధావరాలపైనే కాకుండా వైట్ హౌస్ పైన కూడా ఇరాన్ ఎక్కడ నుండి ? ఏ రూపంలో దాడులు చేస్తుందో అర్ధంకాక టెన్షన్ పడిపోతోంది. దానికితోడు  ఉక్రెయిన్ విమానం కూలిపోవటంతో అగ్రరాజ్యం టెన్షన్ మరింతగా పెరిగిపోతోంది. ఆ భయంతోనే  ట్రంప్ ఒక్కసారిగా శాంతిజనం అందుకున్నారు.

తన మీద కోపంతోనే ఇరాన్ ఉక్రెయిన్ విమానాన్ని కూల్చేసిందంటూ అగ్రరాజ్యం పదే పదే ఆరోపిస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు ఇరాక్ లోని అమెరికా సైనిక స్ధావరాలపై జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో  కనీసం 80 మంది అమెరికా సైనికులు చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే దాడులు జరిగింది వాస్తవమే కానీ ఒక్కరు కూడా చనిపోలేదని స్వయంగా అమెరికా అధ్యక్షుడు  ట్రంపే ప్రకటించారు.

అయితే ఇరాన్ క్షిపణి దాడుల్లో అమెరికా సైనిక స్ధావరాలు ధ్వసమైనట్లు అంతర్జాతీయ మీడియా చెప్పింది. తాజాగా ఇరాన్ విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. కాబట్టి భారీ ఎత్తున స్ధావరాలు ధ్వంసమైనపుడు సైనికులు కూడా చనిపోయే ఉంటారని అంతర్జాతీయ మీడియా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనకు జరిగిన నష్టాన్ని అమెరికా ఎప్పుడూ  ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకోవాల్సొస్తే చాలా తక్కువ చేసి చూపిస్తుందని గతంలో చాలా సార్లే రుజువైంది.

ఏదేమైనా ఇరాన్ దెబ్బకు వైట్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కనీవినీ ఎరుగనంత భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.  వైట్ హౌస్ చుట్టు పక్కల ప్రాంతాల్లో అనుమతి ఉన్న వాళ్ళని తప్ప ఇంకెవరినీ రానీయటం లేదు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా, అమెరికా పోలీసు, ప్రత్యేక భద్రతా విభాగానికి చెందిన సిబ్బంది 24 గంటలూ రెప్ప వాల్చకుండా పహారా కాస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: