తెలంగాణలో సైకో వైద్యురాలు... కత్తులు, సూదులతో నర్సులపై దాడి...?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాలో డాక్టర్ విజయలక్ష్మి ఆమె భర్త రామకృష్ణతో కలిసి ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. భార్యాభర్తలైన విజయలక్ష్మి, రామకృష్ణ ఇద్దరూ ఆ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు.
 
డాక్టర్ విజయలక్ష్మికి తన భర్త రామకృష్ణ నర్సులతో అక్రమ సంబంధం నడుపుతున్నాడనే అనుమానం ఉండేది. రానురాను ఆ అనుమానం బలపడింది. ఆస్పత్రిలో పని చేసే కొంతమంది నర్సులకు డాక్టర్ విజయలక్ష్మికి గతంలో ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. అనుమానాలు బలపడటంతో విజయలక్ష్మి కొంతమంది నర్సులను విధుల నుండి తొలగించింది. ఆ తరువాత తొలగించిన నర్సులను భర్త లేని సమయంలో విజయలక్ష్మి పిలిపించింది. 
 
విజయలక్ష్మి నర్సులు ప్రమీల, సునీతలను పిలిపించి నర్సులను చైర్లో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసింది. ఆ తరువాత విజయలక్ష్మి యాసిడ్, ఫినాయిల్ తో దాడి చేస్తానని నర్సులను బెదిరించింది. ఆ తరువాత నర్సులను సూదులతో గుచ్చటంతో పాటు ఆపరేషన్ చేసే కత్తులను నర్సుల మెడపై ఉంచి తన భర్తతో లైంగిక సంబంధం ఉందా..? లేదా..? అని ప్రశ్నిస్తూ బెదిరించింది. 
 
తన భర్తతో అక్రమ సంబంధం ఉంటే మానుకోవాలని నర్సు సునీతను బెదిరించింది. ఆరుగంటలపాటు వైద్యురాలు నర్సు సునీతను చిత్రహింసలకు గురి చేసింది. ఆ తరువాత సునీత తప్పించుకుని తోటి నర్సుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వైద్యురాలిని కఠినంగా శిక్షించాలని నర్సులు కోరుతున్నారు. నర్సులు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారన్న అనుమానం వైద్యురాలు క్రూరంగా దాడి చేయటానికి కారణంగా తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: