ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ సినిమాకు ఓకే చెప్పి .. గట్టిగా ఇరుక్కుపోయిందిగా ..?
ఇక ఎన్టీఆర్ సినిమా అంటే ఆమె రేంజ్ మరో స్థాయికి వెళ్లినట్టే .. పైగా ప్రశాంత్ నీల్‌తో మూవీ .. వీటితో పాటు కాంతారా 2 .. ఈ రెండు సినిమాలు చాలు రుక్మిణిని పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ హీరోయిన్ అని చెప్పడానికి .. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలే ఈ ముద్దుగుమ్మ కి లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెట్టినట్టు అవుతున్నాయి . ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యేంత వరకు మరో సినిమా చేయకూడదని ఎగ్రిమెంట్లో ఉందట .. ప్రశాంత్ నీల్ చాలా నిదానంగా సినిమాలు చేస్తూ ఉంటారు ఆయనకు ఎప్పుడు డేట్లు కావాలో ఆయనకే తెలియదు .. కాబట్టి అందరినీ లాక్ చేస్తారు .. ఇక కాంతారా 2 విషయంలోను ఇదే జరుగుతుంది .. తన సినిమా అయ్యేంతవరకు మరో సినిమా చేయకూడదని రిషబ్ శెట్టి కూడా రూల్ పెట్టారట ..
ఇక దానికి కూడా రుక్మిణి ఓకే చెప్పింది .. ఈ రెండు సినిమాలు తోనే శతమాతమవుతుంటే రుక్మిణి ఒప్పుకున్న చిన్నచిత్తగా సినిమాలు నాలుగైదు ఉన్నాయి .. వారంతా ఇప్పుడు డేట్ ల కోసం ఎదురుచూస్తున్నారు .. ఎన్టీఆర్ సినిమా కోసం అగ్రిమెంట్ చేస్తున్నప్పుడే రుక్మిణి డిసైడ్ అవ్వాల్సింది.. మిగిలిన సినిమాలు చేయకూడదని .. కానీ వచ్చిన అడ్వాన్సల్లా తీసేసుకుంది ఇప్పుడు వాళ్లకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతుంది . ఇలా ఒక్క రుక్మిణి విషయంలోనే కాదు .. చాలామంది హీరోయిన్ల విషయంలో ఇదే సీన్ రిపీట్ అవుతూ వస్తుంది .. పెద్ద స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది కదా అని అన్నిటికీ రెడీ అయిపోతున్నారు .. కానీ ఎగ్రిమెంట్లు మాత్రం వాళ్ళని గట్టిగా లాక్ చేసి పడేస్తున్నాయి .. ఆ సినిమా పూర్తవ్వదు .. మిగిలిన సినిమాలకు వర్క్ చేసేందుకు అవకాశం ఉండదు .. ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు కంప్లీట్ అవుతుందో రుక్మిణి మిగిలిన సినిమాలకు డేట్లు ఎప్పుడు ఇస్తుందో కాలమే చెప్పాలి.