గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు .. యువరాణిగా యుద్ధం చేసి మెప్పించిన హీరోయిన్లు వీరే..!
బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి .. అయితే ఇప్పుడు మన అగ్ర హీరోయిన్లు కొన్ని సినిమాల్లో యువరాణి పాత్రలో నటించి మెప్పించారు .. వారు ఎవరో ఇక్కడ చూద్దాం . అరుంధతి సినిమాలో అరుంధతి - జేజమ్మగా, బాహుబలిలో దేవసేనగా , రుద్రమదేవిలో రుద్రమదేవిగా యువరాణి పాత్రలో కనిపించి అదరగొట్టారు స్వీటీ అనుష్క .. ఈ సినిమాల్లో కత్తులు లాంటి కళ్ళు శత్రువులను ఎదుర్కొంటూ హీరోలను మించి రాజ్యసం చూపించి మెప్పించారు. ఇక మగధీర సినిమాలో యువరాణి మిత్రబింద పాత్రలో మెప్పించారు కాజల్ అగర్వాల్ .. అందాల యువరాణిగా ప్రేక్షకుల మనసులో చెరుకుపోని స్థానం తెచ్చుకున్నారు ..
రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంట గా కాజల్ అదరగొట్టారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 అండ్ 2 సినిమాలలో శత్రువుల కుయుక్తులను ముందే పసిగట్టి ఎత్తుకు పై ఎత్తు వేసే యువరాణి కుందవై పాత్ర లో ఆకట్టుకుంది చెన్నై బ్యూటీ త్రిష .. దళపతి విజయ్ హీరోగా వచ్చిన పులి సినిమాలో యువరాణి మంథాగినిగా నటించింది హన్సిక .. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది .. ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కూడా కీలకపాత్ర లో కనిపించింది .