టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి మనందరికి తెలిసిందే. కీర్తి సురేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే ఇటీవలే కీర్తి సురేష్ మూడు ముళ్ళు బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న వెంటనే తన నటించిన బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో కీర్తి సురేష్ కు ఒక ఊహించని అనుభవం ఎదురయింది.ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బేబీ జాన్ సినిమా ప్రీమియర్ షోకి కీర్తి సురేష్ వెళ్ళింది. షో అయ్యాక బయటకు వచ్చి కార్ లో ఎక్కుతుంటే కీర్తి సురేష్ టీమ్ అక్కడి ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లతో గొడవ పెట్టుకున్నారు. సాధారణంగా బాలీవుడ్ లో సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వాళ్ళ ఫొటోలు, వీడియోలు తీస్తుంటారు. ఇందుకు కొన్ని సంస్థలతో సెలబ్రిటీలు ప్రమోషన్స్ కోసం మాట్లాడుకుంటారు. దీంతో వాళ్ళు సెలబ్రిటీలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు.
ఇదే క్రమంలో నిన్న కీర్తి సురేష్ బయటకు వచ్చి కార్ ఎక్కుతుంటే పలువురు ఫొటోలు, వీడియోలు తీస్తుండగా కీర్తి సురేష్ టీమ్ కి చెందిన ఒక మహిళ ఆమె కార్ ఎక్కుతున్నప్పుడు ఎందుకు ఇలా తీస్తున్నారు?అభ్యంతకర వీడియోలను మీరు ఎలా తీస్తారు? కార్ లోకి ఎక్కాక తీసుకోకండి అని అక్కడి ఫొటో గ్రాఫర్లతో వాదించింది. కీర్తి సురేష్ కార్ లోంచి ఇదంతా గమనించి తన చీర సరిగ్గా ఉందో లేదో చూసుకుంది. ఇక ఫొటోగ్రాఫర్లు మేమేమి అలా తీయలేదు అంటూ ఇలా మాట్లాడకండి, మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా అంటూ కీర్తి సురేష్ టీమ్ ని ప్రశ్నించారు. ఇలా వాదులాట జరుగుతుండగానే కీర్తి కార్ ఎక్కి వెళ్ళిపోయింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలావుండగా ప్రస్తుతంవైరల్ అవుతున్న వీడియోపై కీర్తి సురేష్ స్వయంగా స్పందించింది. ఇంటర్వ్యూలో ఆ రోజు ఏమి జరిగినా తాను చాలా గందరగోళానికి గురయ్యానని కీర్తి చెప్పింది. 'ఆ గొడవ జరుగుతున్నప్పుడు నాకేం అఏర్థం కాలేదు. నేను చాలా గందరగోళంగా ఉన్నాను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. మీరు నన్ను వీడియోలో చూస్తుంటే మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత నా టీం వ్యక్తి లోపలికి వచ్చాక చెబితే తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది.దీంతో పలువురు నెటిజన్లు, కీర్తి ఫ్యాన్స్ ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.