స్మోకిర్స్ కి అలర్ట్..! మీరు తాగే ఒక్కో సిగరెట్ 22 నిమిషాల ఆయుష్షును తగ్గిస్తుంది..!

lakhmi saranya
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. అయితే కొందరు దీనికి మరీ ఎక్కువగా బానిసై పోతుంటారు. ఎప్పుడో ఒక్కసారి తాగుదామని మొదలు పెట్టేవారు సైతం ప్రతిరోజు డబ్బాల కొద్ది సిగరెట్లు కాల్చుతుంటారు. కొందరు ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా రోజు కనీసం మూడు నాలుగు సిగరెటైనా తాగుతుంటారు. ఇలాంటి అలవాటే స్మోకింగ్ చేసేవారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తాజా ఆధ్యాయనం మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. స్మోక్ చేసే అలవాటు ఉండే పురుషుల్లో ఒక్కో సిగరెట్ 17 నిమిషాల ఆయుష్షును తగ్గిస్తుందని,
అదే మహిళలో అయితే 22 నిమిషాల ఆయుష్షును తగ్గిస్తుందని పేర్కొన్నది. ఏమిటో ఇప్పుడు చూద్దాం. యూనివర్సిటీ కాలేజ్ అండ్ లండన్ పరిశోధకులు పొగా పేల్చడం లేదా సిగరెట్ తాగటం ఆరోగ్యం పై ఏ విధమైన ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు మరోసారి అధ్యాయనం నిర్వహించారు. అనేకమంది స్త్రీ, పురుషుల్లో స్మోకింగ్ అలవాటును పరిశీలించారు. అలాగే స్మోక్ చేసే వారిలో, చెయ్యని వారిలో ఆరోగ్యాన్ని అంచనా వేశారు. కాగా ఈ సందర్భంగా పరిశోధకులు సిగరెట్ తాగని వారి కంటే.. తాగే వారిలో ఒక స్టేజ్ దాటాక ఆరోగ్య సమస్యలు అధికం అయ్యే అవకాశం ఉందని గుర్తించారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లు, లివర్ ప్రాబ్లమ్స్ వంటివి స్మూత్ చేసే వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
 అలాగే సిగరెట్ తాగే అలవాటు సదరు వ్యక్తి ఆయుష్షును తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఒక పురుషుడు రోజు ఒక సిగరెట్ తాగే అలవాటు వల్ల, తాగని వ్యక్తులతో పోలిస్తే ఒక్కో సిగరెట్ కు 17 నిమిషాల ఆయుష్షును కోల్పోతాడు. మహిళల్లో అయితే 22 నిమిషాల ఆయుష్షు తగ్గుతుంది. ఇక రోజుకు 20 సిగరెట్లు తాగే వారిలో ఆయుష్షు 7 గంటలు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే సిగరెట్ తాగే వారిలో ఒకప్పటితో పోలిస్తే స్త్రీ, పురుషుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. 1996 లో మహిళలు రోజుకు సగటన 13.6 సిగరెట్లు తాగేవారని, ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు ఆయుండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. సిగరెట్లలో ఇంకోటి ఉండటం వల్ల ఆగినప్పుడు స్ట్రెస్ రిలీఫ్ గా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: