పెద్ద ప్లానే.. తెలుగులో జెండా పాతటానికి రెడీ అవుతున్న క్రేజీ బ్యూటీ..!
ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో సినిమాలు చేయకపోయినా.. ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. రజినీకాంత్, విక్రమ్, దళపతి విజయ్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఇంతకి ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ మాళవిక మోహన్ .. తమిళ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. అంతకుముందు రజినీకాంత్ పేట , దళపతి విజయ్ మాస్టర్ , విక్రమ్ తంగలాన్ సినిమాల తో మెప్పించింది .
అందుకే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఏకంగా ఓ బడా బిగ్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఆ హీరో రేంజ్ అంతా ఇంతా కాదు మరి తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు అందం లోనూ ఈ ముద్దుగుమ్మ అతిలోక సుందరయ్యే . ఇప్పుడు ప్రభాస్ హీరో గా చేస్తున్న రాజా సాబ్ సినిమా తో డైరెక్ట్ తెలుగులో అడుగు పెడుతుంది. మారుతి దర్శకత్వంలో తెర్కక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానుంది .. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.