శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీ గుండె షెడ్డుకు వెళుతున్నడ్లే..!
రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం వల్ల గుండెపోటు లేదా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. సిరలు మూసుకుపోవటం వల్ల గుండెపోటు వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు గుండె ఆగిపోయే లక్షణాల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. వీటిని సకాలంలో గుర్తిస్తే గుండెపోటు ముప్పు నుంచి సులభంగా బయటపడవచ్చు. లేదా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం ప్రోఫెనర్ డాక్టర్ తరుణ్ కుమార్ మాట్లాడుతూ... హార్ట్ బ్లాక్ లో ఎక్కువగా కనిపించే లక్షణం ఛాది నొప్పి... దీనిలో మీరు తరచుగా ఛాతీపై ఒత్తిడి లేదా బిగుతుగా భావిస్తారు. మీకు గ్యాస్ సమస్య లేకుండే.. దీర్ఘకాలంగా ఛాతీ నొప్పి... దీనిలో మీరు తరచుగా ఛాత పై ఒత్తిడి లేదా బిగుతుగా భావిస్తారు. మీకు గ్యాస్ సమస్య లేకుంటే.. దీర్ఘకాలంగా చాతి నొప్పి కొనసాగితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి.
గుండె ఆగిపోవడం ఇతర లక్షణాల గురించి మాట్లాడితే... ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రత్యేకించి మీరు తేలికపాటి వ్యాయామం చేసినప్పుడు లేదా కొంచెం వేగంగా నడుస్తున్నప్పుడు... మీ గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా వేగంగా మారుతుంది... ఇది కూడా అడ్డుపడటం లక్షణం కావచ్చు. ముఖ్యంగా మీరు వ్యాయామం చేసినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు గుండెలో అడ్డంకులు ఏర్పడటం దీనివల్ల అలసట రావడం దీని లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ధూమపానానికి దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడికి గురి కావద్దు. సంవత్సరానికి ఒక్కసారి గుండె చెకప్ చేయించుకోండి.