రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు వైఎస్ కు లింక్ .. ఆ కలెక్టర్ కథనే శంకర్ తెరకెక్కించాడా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు .. దాదాపు 7 సంవత్సరాలు తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సోలో సినిమా కావటంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కూడా అభిమానులలో సినిమాపై ఇంట్రెస్ట్ ను మరింత పెంచింది. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ తో పోలిస్తే ట్రైలర్ మరో లెవెల్ లో ఉంది అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు . ఇక ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమా ఆటోగ్రఫీ అన్నీ కూడా మెగా అభిమానులను ఎంతగానో మెప్పించాయి.
రామ్ చరణ్ లుక్స్ కూడా ఎంతో హైలైట్ గా ఉండటంతో సినిమా పక్క బ్లాక్ బస్టర్ అంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రిపై చేసే పోరాటాన్ని కథగా తీసుకుని ఈ సినిమాను మొదలుపెట్టారు. ఒక అవినీతి ముఖ్యమంత్రి టార్గెట్ గా చేసుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్న యుద్ధం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలో వచ్చే డైలాగులు కూడా రాజకీయంగా హీట్ ను భారీగా పెంచాయి. ప్రధానంగా నువ్వు ఐదేళ్లు మాత్రమే మంత్రివి .. నేను చనిపోయే వరకు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటా అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ సినిమా వెనుక వేరే కారణం ఉందని కూడా అంటున్నారు .. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లారు .. ఇక ఆ సమయంలో ఒక కలెక్టర్ ను రాజశేఖర్ రెడ్డి అవమానించినట్లు వార్తలు వచ్చాయి. నేను తలుచుకుంటే నీ ప్లేస్ లోకి రాగాలను నువ్వు జీవితాంతం కష్టపడి నా ప్లేస్ లోకి రాలేవు గుర్తుపెట్టుకో అని ఆ ఉద్యోగి రాజీనామా చేసి సొంత పార్టీని స్థాపించారు ఆ కలెక్టర్ .. ఇంతకీ ఆయనే మరెవరో కాదు లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ .. 2006లో ఆయన సొంత పార్టీని స్థాపించి కొన్ని సంవత్సరాలపాటు ప్రజా పోరాటాలు చేసి ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పారు.
ఇక 2009 ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన విజయం సాధించారు. రాజశేఖర్ రెడ్డి కారణంగానే జయప్రకాష్ నారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన కథని గేమ్ ఛేంజర్ సినిమాలో చూపించారని టాక్ కూడా వినిపిస్తుంది. ఆయన స్ఫూర్తిగానే ఈ సినిమా కథ నడుస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ కూడా కాస్త అలాగే కనబడుతున్నాయి. ఇక చూద్దాం మరి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో. రాజకీయంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో.