బాబాయిని ఫుల్లుగా వాడేస్తున్న అబ్బాయి .. గేమ్ ఛేంజర్‌లో కాకినాడ సీన్ రిపీట్..?
మెగా అభిమానుల్లో ఎక్కువగా మాస్ ఆడియన్స్ ఉంటారు .. ప్రత్యేకంగా వారిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ సినిమాల్లో కొన్ని సీన్లను ప్లాన్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది .. ముఖ్యంగా హెలికాప్టర్సీన్‌ను చూస్తే మాస్ ప్రేక్షకులకే కాదు .. క్లాస్ ఆడియన్స్ కూడా విజువల్ ట్రీట్ పక్క .. ఇక కచ్చితంగా దియేటర్లో చొక్కాలు చించుకుంటూ మాస్ ప్రేక్షకులు ఎగరటం ఖాయం అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు ..అలాగే ఈ సినిమాలో ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని కీలక వ్యవహారాలను కూడా చూపించడానికి శంకర్ రెడీ అయ్యారట .. ప్రధానంగా రేషన్ బియ్యం అక్రమ దందా విషయంలో కొన్ని సీన్స్ చూపించారు ట్రైలర్లో.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా ఈ వ్యవహారం నేషనల్ వైట్ గా హైలెట్ అయింది .. దీనితో ఈ వ్యవహారాన్ని ఈ సినిమాలో చూపించేందుకు శంకర్ ఓ భారీ ప్లాన్ చేశాడు .. సీజ్ ది షిప్ అంటూ పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క డైలాగ్ జాతీయ రాజకీయాలను కూడా షేక్ చేసింది.
అదే విధంగా అవసరమైతే ఆ డైలాగ్ కూడా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది .. ప్రభుత్వంపై ఐఏఎస్ పోరాటం మరో లెవల్ లో ఉండనుంది ట్రైలర్ తో చెప్పేసాడు శంకర్ .. అలాగే గత వైసిపి ప్రభుత్వంపై కూడా కొన్ని ఇండైరెక్ట్ డైలాగులు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు మెగా అభిమానులు .. ఇక అప్పట్లో ఐపీఎస్ అధికారులు , ఐఏఎస్ అధికారులను జగన్ ఎలా వాడుతున్నారో ఈ సినిమాలో హైలైట్ చేసి చూపించే అవకాశం ఉంది . ఇక సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ఊహించని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు . ఇక శనివారం రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు . ఈ ఈవెంట్ కు జనసేన పార్టీ మంత్రులు , ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు . ఇక దీనికోసం రాజమండ్రిలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు . మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో రాజకీయంగా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.