టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సంవత్సరాల రాజకీయం అనుభవం కలిగిన వ్యక్తి. ఈయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేశాడు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా కూడా ఎన్నో పోరాటాలు చేసి చివరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో అత్యంత కీలక పాత్రను పోషించాడు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దానితో చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండవ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీకి భారీ అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో రెండవ సారి కూడా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కొంత కాలం క్రితం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దానితో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక కేసీఆర్ ఎక్కువ శాతం బయటికి రావడం లేదు. వచ్చిన పెద్దగా జనాల్లో ఉండడం దానిపై కొంత మంది నెగటివ్ గా స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే అనేక మంది కెసిఆర్ తన స్ట్రాటజీని మార్చుకోవాలి అని , ప్రజల్లో ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కేసీఆర్ కూడా ఇదే స్ట్రాటజీటీ ఫాలో అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల అనంతరం కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక తాజాగా కేసీఆర్ అసెంబ్లీకి కూడా వచ్చాడు. కానీ ఎక్కువ సేపు లేడు. తాజాగా కేసీఆర్ అనేక మంది తన అభిమానులను కలుసుకున్నాడు. ఇలా కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ప్రజలను కలుస్తూ ఉండడంతో ఈ స్ట్రాటజీ సూపర్ గా వర్కౌట్ అవుతుంది అని అనేక మంది బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు.