జేసీ మరో ఎదురుదెబ్బ

Suma Kallamadi
అనంతపురం టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు,మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఏపీ రవాణా శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. జెసి దివాకర్ రెడ్డి కి సంబంధించి జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. మొత్తం జేసీ ట్రావెల్స్ నుండి నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 బస్సులను సీజ్ చేశారు ఆర్టీఏ అధికారులు. అంతేకాదు జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు.


దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయడంపై గతంలో జేసీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ ఉండగా.. జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. తనకు ఉన్న బస్సుల్లో ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న లోటుపాట్లు ఆర్టీసీతో సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమన్నారు. ఫైన్‌తో పోయేదానికి సీజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆయన జగన్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. బస్సుల సీజ్ ప్రక్రియ మాత్రం ఆగకపోవడం గమనార్హం.


రవాణా శాఖ అధికారులు…. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం వంటి అంశాలకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్‌పై తమకు ఫిర్యాదు వచ్చాయని తెలిపారు. రవాణా శాఖ అధికారులు మంగళవారం జరిపిన తనిఖీల్లో ఐదు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడడం జరిగింది.


ఇటీవల జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న జేసీ దివాకర్ రెడ్డిని మధ్యలోని అడ్డగించిన పోలీసులు... ఆయన్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది.  వెంకటాపురంలో టీడీపీ నేత నాగరాజు ఇంటికి అడ్డంగా బండలు పెట్టారు. దీనిపై మూడు రోజులుగా ఆ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు మధ్య గొడవలు మొదలు అయ్యాయి. తమ పార్టీ నేత ఇంటికి అడ్డంగా పెట్టిన బండలు తొలగించేందుకు వెంకటాపురం బయలుదేరిన జేసీ దివాకర్ రెడ్డిని మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: