చంద్రబాబుకు ఎంఎల్ఏల షాక్

Vijaya

గడచిన పది రోజుల్లో గుంటూరు జిల్లాలోని ఆత్మకూరు గ్రామం కేంద్రంగా చంద్రబాబునాయుడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఇంత గగ్గోలు పెట్టారన్న విషయం అందరికీ తెలిసిందే. సరే చంద్రబాబు ఉద్దేశ్యం నెరవేరిందా ? అంటే లేదనే చెప్పాలి.

 

ఎల్లోమీడియా చంద్రబాబుకు అంతలా అండగా నిలబడినా విషయం ఎందుకు సక్సెస్ కాలేదంటే అసలందులో విషయమే లేదు కాబట్టి. అదే సమయంలో టిడిపి ఎంఎల్ఏలే చంద్రబాబుకు షాక్ ఇచ్చిన విషయం పార్టీలో చర్చ జరుగుతోంది. టిడిపికి చంద్రబాబుతో కలుపుకుని 23 మంది ఎంఎల్ఏలున్న విషయం అందరికీ తెలిసిందే. చలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపికి చాలామంది ఎంఎల్ఏలే స్పందించలేదు.

 

విశాఖపట్నం నగరంలోని నలుగురు ఎంఎల్ఏలు ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు ఎక్కడా కనబడలేదు. ఇక స్వయాన బావరమది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కూడా అడ్రస్ లేరు. మరో ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ ఎక్కడా కనబడలేదు. బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ కూడా స్పందించలేదు. గుంటూరు జిల్లాలోని రేపల్లె ఎంఎల్ఏ సత్యప్రసాద్ కూడా పెద్దగా యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు.

 

ప్రకాశం జిల్లా నుండి గెలిచిన ముగ్గురు ఎంఎల్ఏలు కరణం బలరామ్, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు అయితే ఎక్కడా కనబడలేదు. ఇక ముగ్గురు ఎంపిల్లో రామ్మోహన్ నాయడు జాడే లేదు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కూడా పెద్ద పార్ట్ తీసుకోలేదు. విజయవాడ ఎంపి కేశినేని నాని బుధవారం ఉదయం మాత్రమే కనిపించి హౌస్ అరెస్టు అయ్యారు.

 

అంటే చంద్రబాబు పిలుపికి టిడిపి ఎంఎల్ఏలే పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ఇందులో విషయం ఏమీలేదన్న విషయం పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏదో చంద్రబాబు రచ్చ చేయాలనుకున్నారు చేశారు అంతే.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: