జగన్ కు కొత్త పేరు పెట్టిన లోకేశ్.. ?

Chakravarthi Kalyan

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఫైబర్ గ్రిడ్ అంశంపై మాటలయుద్ధం నడుస్తోంది. ఫైబర్ గ్రిడ్ పథకం నిర్వహణలో వెయ్యి కోట్ల రూపాయల పైనే అవినీతి జరిగిందని ఏపీ మంత్రి గౌతం రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. జోగి రమేష్, ఆళ్ల రామకృస్ణారెడ్డి వేసిన ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు.


పైబర్ నెట్ కనెక్సన్ 149 రూపాయలు అని ప్రచారం చేశారని... కాని సెట్ ఆప్ బాక్స్ లు మాత్రం ఐదు వేల రూపాయల చొప్పున వసూలు చేశారని మంత్రి అసెంబ్లీలో వివరించారు. నిజానికి మార్కెట్ లో ఈ బాక్స్ లు కేవలం 3500 రూపాయలకే దొరుకుతున్నాయన్నారు.


ఈ ఆరోపణలపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. దేశం మెచ్చిన పథకంలోనూ అవినీతి చూడటం వైసీపీకే చెల్లిందంటున్నారు. ఈ ట్వీట్ లో జగన్ను ఆయన వెటకారంగా జలగన్న అంటూ కోట్ చేశారు.. ఆయన ఏమన్నారంటే..


“ పేదలకు తక్కువ ధరకే బ్రాడ్ బ్యాండ్, ఫోన్, కేబుల్ ఇస్తే, వైసీపీ వాళ్ళ ఏడుపు దేనికో అర్ధం కావటం లేదు. అప్పట్లో తెదేపా ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ మొదలు పెట్టిన రెండో రోజే కేబుళ్ళు కట్ చేసారు. కోర్టుల్లో కేసులు వేసి ఆపేయించాలని కుట్రలు పన్నారు. అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తెదేపాకు ప్రజల్లో మంచి పేరు వచ్చేస్తుందన్న ఏడుపు ఉండొచ్చు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అవే మాటలు, అవే ఆరోపణలు చేస్తుంటే, వింటున్న ప్రజలకు మీ మీద రోత పుడుతోంది బుగ్గనగారూ.


ఏపి ఫైబర్ గ్రిడ్ వ్యవస్థతో మేము సాధించిన ఫలితాలను భారత రాష్ట్రపతితో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మెచ్చుకున్నారు. రూ.5 వేల కోట్లు పట్టే ప్రాజెక్టును రూ. 350 కోట్లతో పూర్తి చేసిన ఘనత మాది. అవినీతి అంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదు, నిరూపించండి. రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు. ఆయన్ను పక్కన ఉంచుకుని మా మీద ఆరోపణలు చేస్తే జనం నవ్వుతారు. మీ నేతలా ప్రజల రక్తం పీల్చే దుస్థితిలో నేను లేను...ఆధారాలు చూపించకుండా ఆరోపణలతో బ్రతికేస్తాం అంటే మీ ఇష్టం..”

తన ట్వీట్ కు సపోర్ట్ గా పత్రికల్లో వచ్చిన కథనాలను లోకేశ్ జత చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: