Rtv రవి ప్రకాష్‌పై బ్యాన్ తప్పదా.. ?

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి అయిపోయింది. రెండు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ భారీగానే నమోదు అయింది. గతంలో కంటే ఏపీలో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు అయినట్లు చెబుతున్నారు. దాదాపు 70% ఓటర్లు ఏపీలో ఓటు హక్కును వినియోగించుకున్నారట.
అయితే ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. అప్పటివరకు ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సర్వే రిపోర్టులు ఏ సంస్థ కూడా ప్రకటించకూడదు. ఇటీవల ఎన్నికల సంఘం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కానీ ఆర్ టి వి ఓనర్ రవి ప్రకాష్ మాత్రం ఎన్నికల సంఘాన్ని బేఖాతార్ చేశారు. ఏపీ అలాగే తెలంగాణ ఎన్నికల కంటే ముందు రోజు సర్వే లెక్కలను బయటపెట్టారు.
అంతేకాదు ఏపీలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ తో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూను ఎన్నికల కంటే ఒకరోజు ముందు లైవ్ పెట్టేశారు రవి ప్రకాష్. ఇక ఈ ఇంటర్వ్యూలో వైసిపి పార్టీకి 51 స్థానాలు మాత్రమే వస్తాయని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. అయితే... ఈ ఇంటర్వ్యూ ఏపీలో వైసీపీ పార్టీకి తీవ్రని నష్టం చేకూర్చిందని స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని వైసిపి పార్టీ మల్లాది విష్ణు కూడా స్పష్టం చేశారు.
కేంద్ర బిజెపితో కలిసి చంద్రబాబు నాయుడు ఈ కుట్రలు చేయించాడని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. రవి ప్రకాష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఎన్నికల కంటే ఒక రోజు ముందు... వైసీపీ పై బురద జల్లారని మండిపడ్డారు మళ్ళది విష్ణు. అటు ప్రశాంత్ కిషోర్ కూడా... జగన్ పైన కోపంతో ఇష్టం వచ్చినట్లు ఇంటర్వ్యూలో మాట్లాడారని... వైసిపికి గోర ఓటమి తప్పదని... ఎన్నికల కంటే ముందు చెప్పడం దుర్మార్గం అంటూ వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్న... రవి ప్రకాష్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని వైసిపి మండిపడుతోంది. ఒక రాజకీయ పార్టీని నష్టపరిచేలా రవి ప్రకాష్ వ్యవహరించాలని... అతనిపై బ్యాన్ వేయాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ పార్టీ.  అయితే ఏపీలో మరోసారి వైసీపీ పార్టీ వస్తే... కచ్చితంగా రవి ప్రకాష్ కు ఇబ్బందులు ఎదురవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో కూటమి అధికారంలోకి వస్తే... రవి ప్రకాష్ మరింత రెచ్చిపోయి... జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తారని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనా రవి ప్రకాష్.. ప్రయత్నం కూటమికి మాన‌సికంగా అనుకూలించిందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: