"పుష్ప 2" ఆ మూవీ అసలు పోటీనే కాదా..?

Pulgam Srinivas
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా , టాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... మలయాళ స్టార్ నటుడు పహాధ్ ఫాజిల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 న విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై నార్త్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో చాలా హిందీ సినిమాలు ఈ మూవీ విడుదల తేదీకి దగ్గర విడుదలను ప్రకటించలేదు.

ఇలాంటి సమయంలో జాన్ అబ్రహం హీరోగా రూపొందిన వేదా మూవీ ని పుష్ప పార్ట్ 2 సినిమా విడుదల తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ వార్త వైరల్ కావడంతో చాలా మంది అసలు పుష్ప 2 కి ఈ సినిమా అసలు పోటీనే కాదు. ఏదో పుష్ప సినిమా విడుదల తేదీనా ఈ సినిమా రాబోతుంది అని ఫేమస్ అయ్యింది , కానీ ఈ సినిమాను ఎవరు పెద్దగా పట్టించుకోరు అని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇన్ని అంచనాలు కలిగి ఉన్న పుష్ప పార్ట్ 2  ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: