దేవర టార్గెట్ అదే... వర్కౌట్ అయితే ఇక అంతే..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి అంతా రెడీ చేసుకున్నాడు. ఇక కొరటాల ఆఖరుగా ఆచార్య అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

దీనితో మరోసారి ఇలాంటి తప్పు జరగకూడదు అనే ఉద్దేశంతో కొరటాల "దేవర" మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులనే చాలా రోజులు చేశాడు. దానితో ఈ మూవీ స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టింది. ఇక చాలా ఆలస్యం తర్వాత ఈ మూవీ షూటింగ్ మొదలు అయింది. ఆ తర్వాత ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమా మొదటి భాగాన్ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ సినిమాలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ అయినటువంటి జాన్వి కపూర్ ను తీసుకున్నారు.

ఈ మూవీ లో విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇలా హీరో, దర్శకుడు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా ఫుల్ క్రేజ్ ఉన్నవారు కావడంతో ఈ మూవీ పై ఒక్క సారిగా ఫుల్ బజ్ ఏర్పడింది. ఇక మొదటి నుండి కూడా ఈ మూవీ బృందం ఇండియా మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నారు. అది కానీ వర్కౌట్ అయిందో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్ ఖాయం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: