పల్నాడు : జిల్లాలో జరిగిన విద్వంసానికి కారణం వారే.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. గతంలో కంటే ఎక్కువగా ఓటు వెయ్యడానికి ప్రజలు ఆసక్తి చూపించారు. మండుటెండను కూడా లెక్క చెయ్యకుండా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు వేసి చరిత్ర తిరగరాశారు.ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన మరి కొన్ని జిల్లాల లో మాత్రం విద్వంసకర దాడులు జరిగిన సంగతి తెలిసిందే.పల్నాడు ప్రాంతం లో భారీగా దాడులు జరిగాయి..నిన్న ఉదయం నుంచి చెదురుమదురు ఘటనల తో ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం కల్లా దాడులకు దారి తీసింది. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ కూటమి గా సాగుతున్న ఈ పోరు లో నేతలు పరస్పరం దాడులకు దిగారు.దీనితో విధ్వంసం చోటు చేసుకుంది..ఈ దాడుల వివరాలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్లగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. 

గుంటూరు జిల్లాలోని తెనాలి, పల్నాడు జిల్లాలోని మాచర్ల, అనంతపురం లో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం లో ఉంచడం తో పాటు కేసులు నమోదు చేయాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు.దాడులు ఉదృతం కావడంతో పోలీసులు తీవ్ర ప్రయత్నలతో దాడిని ఆపగలిగారు.అయితే నిన్న పల్నాడు జిల్లాలో దాడులను బాధాకరమని వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.పల్నాడు లో నిన్న టీడీపీ అరాచకాన్ని ప్రజలంతా గమనించారు అని ఆయన తెలిపారు..వైసీపీకి మద్దతు తెలిపిన గ్రామాల పై టీడీపీ నేతలు దాడులు చేసినట్లుగా అనిల్ ఆరోపించారు..దాడులు జరుగుతున్న కూడా పోలీసులు అస్సలు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు..పోలీసులు, రెవెన్యూ అధికారులు టీడీపీ కి కొమ్ముకాసారని వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. టీడీపీ అభ్యర్థి అరవిందబాబు కి ఈసీ రూల్స్ వర్తించవా అని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: