
ఏపీ పోలింగ్ : ఈ మూడు సీన్లు చాలు... జగన్ మళ్లీ సీఎం అవుతున్నాడని చెప్పేశాయ్..?
మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ జరుగుతున్న సరళని బట్టి చూస్తే పోలింగ్ బూత్‌ల వద్ద మిట్ట మధ్యాహ్నం ఎండ అని చూడకుండా మహిళలు, వృద్ధులు బారులు తీరారు. మహిళలు వృద్ధులు క్యూ లైన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో కూటమిలో దడ మొదలైందని వైసీపీ నేతలు చెబుతున్నారు. తమకు ఏ సెక్షన్ లో ఎక్కువ ఓట్లు పడతాయని ఇంతకాలం చెప్తూ వచ్చామో వారంతా పోలింగ్ బూత్‌ల వద్ద పెద్ద సంఖ్యలో కనిపిస్తుండడంతో తమకు ఇది సానుకూల సంకేతంగా అధికార పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
మహిళలు, వృద్ధులతో పాటు పెన్షన్ దారులు.. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేవారు... వీరంతా వైసీపీకి 80 శాతానికి పైగా ఓట్లు వేసినట్టు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో వైసీపీ ఫుల్ ఖుషీగా ఉంది. ముందు నుంచి కూడా పైన చెప్పుకున్న సెక్షన్ ఓటర్ల లో వైసీపీకి మంచి ఓటు బ్యాంకు ఉంటుందని చెపుతున్నారు. ఇక ఓటింగ్ సరళి చూస్తే కూడా గ్రామీణ ప్రాంతాల్లో జనాలు వైసీపీకి పట్టం కడుతున్నట్టుగా క్లీయర్‌గా తెలుస్తోంది.
ఇక ఆంధ్రా జనాలు కూడా మరోసారి జగన్‌ను సీఎం చేసుకోవాలని కసితో ఉన్నారని అందుకే అర్ధరాత్రి వరకు కూడా క్యూలో ఉండి మరీ ఓట్లేశారని సగటు రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయంగా చెపుతున్నారు. ఏదేమైనా పోలింగ్ సరళిపై వైసీపీ చాలా ధీమాతో కనిపిస్తోంది.