నామినేషన్ వేసిన మోదీ... మూడోసారి కూడా గెలుస్తారా..?

Pulgam Srinivas
భారతదేశం లోకి ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. కాకపోతే ఇది ఇండియాలోకి అడుగు పెట్టిన సమయంలో పెద్దగా ఎవరు వీటిని ఆదరించలేదు. దానితో చాలా తక్కువ మంది మాత్రమే ఈ కంటెంట్ వీక్షించడంతో ఇండియాలో కూడా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లు చాలా తక్కువగానే ఉండేవి. ఇక ఎప్పుడు అయితే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఓ టీ టీ ప్లాట్ ఫామ్ ల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. కరోనా సమయంలో థియేటర్లు మూతపడడం , అలాగే టీవీల్లో కూడా కొత్త కంటెంట్ లేకపోవడంతో జనాలు అంతా ఓ టీ టీ లపై పడిపోయారు.

దానితో వీటి క్రేజ్ కూడా ఫుల్ గా పెరిగింది. ఇక విచ్చలవిడిగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లు మార్కెట్ లోకి వచ్చేసాయి. ఇలా ఓ టి టి ప్లాట్ ఫామ్ లు భారీగా రావడంతో ఆ పోటీని తట్టుకోవడం కోసం ప్రతి వారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ఏదో ఒక కంటెంట్ జనాల ముందుకు తీసుకువస్తున్నారు. ఇకపోతే ఇందులో కొంత అసభ్యకరమైన కంటెంట్ కూడా ఉండడంతో కుటుంబ సమేతంగా ఇందులోని కంటెంట్ చూడడం జనాలకు ఇబ్బంది అవుతుంది. ఇకపోతే ఇలాంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఓ "ఓ టి టి"  ఫ్లాట్ ఫామ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంస్కృతి మరియు మన భారత దేశ సంస్కృతి తెలిపే విధంగా ఉండే కంటెంట్ ను ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఇందులోని కంటెంట్ ఉండబోతున్నట్లు , అలాగే విద్యకు సంబంధించిన కంటెంట్ కూడా ఇందులో అందుబాటులో ఉంచబోతున్నట్లు ఇలా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే కంటెంట్ ను కేంద్ర ప్రభుత్వం ఓ టీ టీ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు , ఈ ఓ టి టి యొక్క కంటెంట్ ను ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చి ఆ తర్వాత డబ్బులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: