ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!

Prathap Kaluva

జగన్ మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి పక్ష నేత. అతి తక్కువ వయసులోనే పార్టీ పెట్టి అతి తక్కువ మెజారిటీ తో అధికారాన్ని కోల్పోయిన యువనేత. అయితే 40 ఏళ్ల యువకుడైనా జగన్ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్ర బాబుకు ధీటుగా బలమైన నాయకుడిగా, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆంధ్రలో ఎదిగాడు. నిజానికి తన తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటికి జగన్ కు రాజకీయాలు ముళ్లబాటలే పరిచాయి కానీ ఎర్రతివాచీ వేసి పెట్టలేదు. అయితే జగన్ ను ఒక బలమైన నేతగా ఎదగటానికి దోహదం చేసిన కారణాలు ఏంటి.. ఇప్పటివరకు ఏ సీఎం కొడుకు కూడా జగన్ మాదిరిగా ఇంత పాపులారిటీని సంపాదించలేకపోయాడు. ఇప్పుడు జగన్ ను సీఎం రేసులో కూర్చో బెట్టటానికి దోహదం చేసిన అంశాలు ఏంటి ..?


ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ తిరుగుబాటు ధోరణి తనను బలమైన నేతగా ఎదిగేలా చేసింది. పులివెందులలో రాజశేఖర్ రెడ్డి జనాలకు బాగా తెలుసు కానీ తన బిడ్డ అయినా జగన్ జనాలకు పూర్తిగా తెలియదు. తన కొడుకుగా అందరూ అభిమానం చూపించేవారే కానీ ఓకే రాజకీయ నాయకుడిగా ఎవరు పెద్దగా గుర్తించలేదు. అప్పుడు జగన్ రాజకీయాల్లో కూడా లేడు. తన పాటికి తానూ బెంగళూరులో వ్యాపారాలు చూసుకునేవాడు. అయితే తన తండ్రి ముఖమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల హత్య కేసులో జగన్ నిందితుడని ప్రతి పక్ష నేతలు ఆరోపించారు. అప్పుడు రాజకీయలలో జగన్ పేరు బలంగా వినిపించింది. అయితే రాజశేఖర్ రెడ్డి ... నిజంగా తన కొడుకు తప్పు చేసి ఉంటె ఉరి తీసుకోవచ్చని సంచలనం రేపాడు. అంతటితో ఆగకుండా ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించాడు. అప్పటి సీబీఐ విచారణ జరిపి జగన్ కు, పరిటాల హత్యకు ఎటువంటి సంభందం లేదని తేల్చి పారేశారు.


అప్పుడు జగన్ మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. అప్పుడు రెండే మీడియా చానెల్స్ ఉండేవి కాబట్టి వాటికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఆ ఇంటర్వ్యూ లో ఓక్ పరిణితి కలిగిన నేతగా ముక్కుసూటిగా సమాధానాలు ఇవ్వటం తో జగన్ కో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడని జనాలు చర్చించుకోవటం మొదలు పెట్టారు. తరువాత జగన్ రాజకీయాల్లో రావాలని కొంత మంది డిమాండ్ చేయడంతో కడప ఎంపీగా పోటీ చేయాలనీ జగన్ అనుకున్నాడు. అయితే అప్పడు ఆ ప్రతి పాదనకు సోనియా గాంధీ ఒప్పుకోలేదు. దీనితో జగన్ మీద జరుగుతున్న అణచివేత అతను తట్టుకోలేకపోయాడు. తన తండ్రి సీఎం అయినా కూడా సోనియా గాంధీ ఒప్పుకోకపోవటం జగన్ ను నచ్చలేదు. 


తరువాత ఎన్నికల్లో మొత్తానికి జగన్ .. కడప ఎంపీగా పోటీ చేశాడు. భారీ మెజారితో ఆ ఎన్నికల్లో నెగ్గాడు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ఒక్క సారిగా జగన్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పాలి. రాజశేఖర్ తరువాత ఎవరు సీఎం అని అధిష్ఠానం నిర్ణయించి రోశయ్యకు ఆ అవకాశం ఇచ్చి ఆ సీట్లో కూర్చో బెట్టింది. అయితే జగన్ తన ను సీఎం చేయాలను అధిష్ఠానాన్ని గానీ, తానూ కానీ సంతకం పెట్టి ఇవ్వలేదు. కాంగ్రెస్ లోని కొంత మంది నేతలు బొత్స లాంటి నేతలు సుమారు 154 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి అధిష్ఠానికి అందించారు. అయితే అంత మంది ఎమ్మెల్యేలు సైన్ చేసిన సోనియా జగన్ ను సీఎం చేయడానికి ఒప్పుకోలేదు. 


దీనితో మళ్ళీ జగన్ మీద కాంగ్రెస్ అణచివేసే ధోరణిని ప్రదర్సించింది. జగన్ ఎప్పుడైతే ఓదార్పు యాత్ర చేస్తానన్నాడో దానికి సోనియా ఒప్పుకోలేదు. అంటే కాంగ్రెస్ అధిష్టానం జగన్ ను తన చేయి కింద పెట్టువాలని చూసిందని చెప్పాలి. ఈ అణచివేసే ధోరణి జగన్ సహించక ఓదార్పు యాత్ర చేయాల్సిందేనని మొండి ధైర్యంతో కొనసాగించాడు. దీనితో సోనియా గాంధీ కి నచ్చలేదు. జగన్ మీద కేసులను పెట్టి వేధించే క్రమం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ కేసులు మంచివి, చెడ్డవి అని పక్కన పెడితే అప్పటివరకు లేని కేసులు జగన్ ఎప్పుడైతే సోనియా మాటకు ఎదురు చెప్పాడో, అప్పుడే ఎందుకు వచ్చాయి. నిజంగా అవినీతే జరిగితే రాజశేఖర్ ఉన్నప్పుడే ఆ కేసులు పెట్టాలి. కానీ అలా జరగలేదు. అయితే జగన్ కేసులు కు భయపడకుండా సోనియా కు తలవంచకుండా ఏకంగా వైసీపీ పార్టీని ప్రకటించారు. 


దీనితో కాంగ్రెస్ .. జగన్ ను జైలుకు పంపించే కార్యక్రమం కూడా జరిగింది. అయితే జనాల్లో జగన్ కు పెరుగుతన్న పాపులారిటీ కాంగ్రెస్ ను కలవర పెట్టడం మొదలైంది. అప్పుడే రాష్ట్ర విభజన అనే అంశాన్ని తెర మీద కు తీసుకొచ్చి జగన్ ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రాయలసీమ కంటే తెలంగాణ లో రెడ్డి సామజిక వర్గం ఎక్కువగా ఉంది. దీనితో జగన్ ను ఒక్క ప్రాంతానికి పరిమితం చేయాలనీ కాంగ్రెస్ కుట్ర పన్నింది. అయినా కూడా జగన్ ను తన పోరాటం ఆపకుండా ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ కొంచెం తేడాతో అధికారాన్ని కోల్పోయాడు. కానీ 9 ఏళ్ల నుంచి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాడు. మరీ 2019 లో ఎవరికీ జనాలు అధికారాన్ని కట్టబెడతారో ..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: