అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్ట్..!

Edari Rama Krishna
భారత దేశంలో అత్యంత విషాదం నింపిన ఘటన 1993 ముంబాయి పేళుళ్లు.  దీనికి ముఖ్య సూత్రదారి అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేళుళ్లు జరిగిన వెంటనే దేశం వదిలి పారిపోయాడు.  ప్రస్తుతం ఆయన పాకిస్థాన్ లోని కరాచిలో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నా..తాను ఉన్న రహస్యాన్ని మాత్రం ఇప్పటి వరకు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దావూద్.  తాజాగా కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం చిన్న తమ్ముడు ఇక్బాల్ కస్కర్‌ ను థానే పోలీసులు పట్టుకున్నారు.  

బొంబాయి పేలుళ్ల అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తలదాచుకున్న కస్కర్ ను ఒక హత్య కేసు, అక్రమ నిర్మాణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసి, 2003లో భారత్ కు తీసుకొచ్చారు. అయితే 2007లో ఈ కేసుల నుంచి కస్కర్ విముక్తి పొందాడు.  గత కొంత కాలంగా కస్కర్ అక్రమ దందాలు, భూ కబ్జాలు, అక్రమ వసూళ్లు, బ్లాక్ మెయిలింగ్ కి పాల్పపడుతున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కస్కర్ ను అతని సోదరి హసీనా పార్కర్ ఇంటిలో అరెస్ట్ చేశామన్నారు.

ఇతనితో బాటు దావూద్ అనుచరులైన మరో ఇద్దరిని  వారు కోర్టులో హాజరు పరచగా..ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి పంపారు.  ఓ బిల్డర్ నుంచి నాలుగు ఫ్లాట్లు, 30 లక్షలు డిమాండ్ చేశాడని, అతడిని విచారించినప్పుడు మరికొందరు బిల్డర్లు, పొలిటిషియన్ల పేర్లు బయటపడ్డాయని పరమ్ వీర్ సింగ్ చెప్పారు.

పూర్తి సమాచారం, పక్కా వ్యూహంతో కస్కర్ ని పట్టుకున్నట్లు పరమ్ వీర్ సింగ్ చెప్పారు.  థానే పోలీసు శాఖలో యాంటీ ఎక్స్ టార్షన్ విభాగం హెడ్ ప్రదీప్ వర్మ ఆధ్వర్యంలో ఈ అరెస్టు జరిగింది. గతంలో ఈయన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పాపులర్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: