తాజా వలస విధానానికి మేము వ్యతిరేకం..!!!

NCR

అమెరికాలో ఉంటున్న విదేశీయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రీన్ కార్డ్ ఆశలపై ట్రంప్ ప్రభుత్వం నీళ్ళు చల్లిన విషయం విధితమే. ప్రభుత్వ పధకాలు పొందే వాళ్ళు ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ ఆశలని వదులుకోవాల్సిందే అంటూ కొత్త వలస విధానాన్ని ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ముందుకు అడుగులు వేస్తున్న తరుణంలో డెమోక్రటిక్ పార్టీ స్పందించింది.

 

వాషింగ్టన్ అటార్నీ జనరల్ డెమొక్రాట్ పార్టీ నేత అయిన బాబ్ ఫెర్గుసన్ ట్రంప్ విధానంపై మండిపడ్డారు. బాబ్ కి మద్దతుగా ఎంతో మంది అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు నిలిచారు. ఇది నూతన వలస విధానం కాదని, వలస వ్యతిరేక విధానమని ఆయన విమర్శించారు. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కలిపించే అవకాశాలని విదేశీయులకి దూరం చేయడమే ఈ కొత్త విధాన అసలు ఉద్దేశమని ఆయన అన్నారు.

 

అమెరికాలో శాశ్వత నివాసం పొందాలంటే ప్రభుత్వం నుంచీ వచ్చే రాయితీలని వదులుకోవాలని చెప్పడం ఎంతో హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. అయితే ఈ తాజా విధానం అమలు కాకుండా చట్టబద్ధమైన అవకాశాలు ఏమైనా ఉన్నాయో లేవో అనే విషయాలని మేము పరిశీలిస్తున్నామని బాబ్ ప్రకటించారు. ఈ విధానం గనుకా అమలులోకి వస్తే దాదాపు 1,40,000 మంది కి ప్రభుత్వ ప్రయోజనాలు దూరం అవుతాయని ఇది ఎంతో దారుణమైన విషయమని బాబ్ తెలిపారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: