సెక్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. ఎక్కడో తెలుసా?

praveen
రష్యాలో జనన రేటు తగ్గుతున్న నేపథ్యంలో, దేశంలోని జనాభా పెరుగుదల కోసం ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే రష్యాలో ' మినిస్ట్రీ ఆఫ్ సెక్స్'ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. రష్యా పార్లమెంట్‌లోని కుటుంబ సంరక్షణ కమిటీ చైర్‌పర్సన్ నినా ఒస్టానినా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం, దేశంలో జనన రేటు పెరగడానికి కొత్త కొత్త ఆలోచనలను అమలు చేయాలని భావిస్తున్నారు. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం వల్ల రష్యాలో చాలా మంది మరణించడంతో జనాభా తగ్గుదల మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం వినూత్న మార్గాలను అన్వేషిస్తోంది.
రష్యాలో బర్త్ రేటు తగ్గుతున్న సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కొత్త కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రాత్రి 10 గంటల నుండి ఉదయం 2 గంటల వరకు ఇంటర్నెట్‌ను నిలిపివేసి, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలనే ప్రతిపాదన వచ్చింది. దీని వల్ల జంటలు ఒకరిపై ఒకరు ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
అంతేకాకుండా, ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకునే తల్లులకు పెన్షన్‌లో భాగంగా ప్రత్యేకంగా డబ్బు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇంట్లో పనులు చేసుకునే తల్లులకు నెలకు 5,000 రూబిళ్లు (సుమారు రూ.4,395) వరకు ఇవ్వాలని ప్రతిపాదించారు. అలాగే, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు హనీమూన్‌కు వెళ్లడానికి 26,300 రూబిళ్లు (సుమారు రూ.23,122) వరకు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు. దీని వల్ల జనన రేటు పెరగడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
రష్యాలో బర్త్ రేటు తగ్గుతున్న సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో విభిన్న ప్రయత్నాలు చేస్తోంది. ఉదాహరణకు, ఖబరోవ్స్క్ ప్రాంతంలో ఒక బిడ్డ పుట్టినప్పుడు యువతులకు సుమారు రూ.97,311 ఇస్తున్నారు. అదేవిధంగా, చెలియాబిన్స్క్‌లో మొదటి బిడ్డకు రూ.9,19,052 వరకు ఇస్తున్నారు. నన రేటు పెంచడానికి కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారు. ఒక ఆరోగ్య శాఖ అధికారి ఉద్యోగులు కాఫీ బ్రేక్, లంచ్ బ్రేక్‌ల సమయంలో కుటుంబాన్ని పెంచడం గురించి ఆలోచించాలని సూచించారు. అంతేకాకుండా, మాస్కోలోని ప్రభుత్వ ఉద్యోగులను వారి లైంగిక ఆరోగ్యం గురించి ప్రశ్నాపత్రం పూరించమని కోరుతున్నారు. ఈ ప్రశ్నాపత్రాన్ని పూరించకపోతే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మాస్కోలో సంతానోత్పత్తి సమస్యలను గుర్తించడానికి ఉచిత పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే 20,000 మంది మహిళలు ఈ పరీక్షలు చేయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: