ఆ రెండు దేశాల యుద్ధం.. అమెరికాకు అతిపెద్ద తలనొప్పి?

Chakravarthi Kalyan
సిరియాలో ఉన్న తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగలిపోతున్న ఇరాన్ చెప్పినట్లుగానే ఇజ్రాయెల్ పై దాడికి తెగబడింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో వంద కన్నా ఎక్కువ డ్రోన్లు, మిస్సైళ్లను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. అయితే అప్పటికే సిద్ధంగా ఉన్న ఇజ్రాయెల్ ఈ డ్రోన్లు, మిసైళ్లను సమర్థంగా తిప్పి కొట్టింది.  

అంతే కాకుండా ఆపరేషన్ ఐరన్ షీల్డ్ పేరుతో ఇరాన్ పై ప్రతీకార దాడి ఉంటుందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమాన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.  దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల పరస్పర దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆయుధ సంపత్తిలో ఇరాన్, ఇజ్రాయెల్ రెండు సమానమే అయినా.. టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ కాస్త ముందుంది. అయితే ఈ దాడుల్లో ఎవరు పై చేయి సాధిస్తారు..  ఏ దేశం ఎవరికి మద్దతు ఇస్తారో ఆసక్తికరంగా మారింది.

అయితే..  పాలస్తీనా దేశంలో హమాస్ తీవ్రవాదులతో పాటు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ తో పాటు పలు ఉగ్రవాద సంస్థలు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఆశ్రయం పొందుతున్నాయి. వీళ్ల ఆగడాలు తట్టుకోలేక కొందరు ఇతర దేశాలకు వలస పోయి అక్కడ తలదాచుకునే ప్రయత్నం చేసి.. వేరే దేశాల్లో తమ సంతతిని పెంచుకున్నారు. ఇప్పుడు అక్కడే నివసిస్తూ.. ఉపాధి పొందుతూ హాయిగా జీవిస్తున్నారు.

ఇలా వెళ్లిన వారు అమెరికాలో లక్షల మంది ఉన్నారు. వీరంతా హమాస్ కి మద్దతుగా ఇజ్రాయెల్ కు వ్యతిరేక పక్షంగా అగ్రరాజ్యం ఉండాలని.. పైగా ఈ దాడులను అమెరికానే ఆపేయించాలని భారీ ఎత్తున నిరసనలు చేస్తూ.. ర్యాలీలు తీస్తున్నారు. పాలస్తీనాను రక్షించాలని డిమాడ్ చేస్తూ.. ఆందోళనలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేస్తూ.. ట్రాఫిక్ కు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.  శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపించాలని అమెరికాను డిమాండ్ చేస్తున్నారు. దీంతో అమెరికాలో కొత్త సమస్య వచ్చి పడినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

war

సంబంధిత వార్తలు: