ఈటీవీలో ఆకట్టుకుంటోన్న సరికొత్త ధారావాహిక ‘రాధా మనోహరం’

Anilkumar
బుల్లితెరపై సీరియల్స్ అనేది ఎప్పుడూ వినోదాన్ని అందిస్తూనే ఉంటాయి. మహిళా ప్రేక్షకుల్లో సీరియల్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మహిళల ఆదరణతో సీరియల్స్ నిరంతరం సాగుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈటీవీలో వచ్చే సీరియల్స్ తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్రను వేస్తుంటాయి. ఈ క్రమంలో రాధా మనోహరం అనే మరో కొత్త సీరియల్ వచ్చేసింది. తల్లీకూతుళ్లు, భార్యా భర్తల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా ఈ సీరియల్ కథ సాగనుంది.
శతమానంభవతి, ముత్యమంత ముద్దు,అగ్ని పరీక్ష, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అంటూ పలు సీరియల్స్‌లో తన నటనతో ఆకట్టుకున్న సిద్దార్థ్ వర్మ రాధా మనోహరంతో మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నారు. కన్నడ సీరియల్స్‌లో ఫుల్ బిజీగా ఉండే శాలోమీ డిసౌజా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.
తల్లి ప్రేమ తెలియని అమ్మాయి.. కూతుర్ని పోగొట్టుకున్న అమ్మ.. భార్యభర్తల మధ్య సంఘర్షణ వంటి ఎమోషనల్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ రాధా మనోహరం సీరియల్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం గం. 2 : 30 నిమిషాలకు ప్రసారం కానుంది. ప్రస్తుతం ఈ సీరియల్ బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/reel/C6JKIsNxH2D/?igsh=Y3oyMHo0cW45emN0
 
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: