మెరుపు బ్యాటింగ్.. నితీష్ రెడ్డి అరుదైన రికార్డ్?

praveen
నితీష్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం 2024 ఐపీఎల్ సీజన్లో కాస్త గట్టిగా వినిపిస్తున్న పేరు. సాధారణంగానే ప్రతి ఐపీఎల్ సీజన్లో కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు డెబ్యూ చేస్తూ ఉంటారు. ఇలా ఐపీఎల్ లోకి అరంగేట్రం  చేసిన కొంతమంది ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు అదరగొడుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది జరుగుతున్న ఐపిఎల్ సీజన్ లో కూడా ఇలా ఎంతో మంది ప్లేయర్లు మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మరి ముఖ్యంగా సన్రైజర్స్ తరఫున ఆడుతున్న తెలుగు క్లియర్ నితీష్ కుమార్ రెడ్డి అయితే బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు.

 అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లు సైతం బ్యాటింగ్లో విఫలమవుతున్న పిచ్లపై నితీష్ కుమార్ రెడ్డి మాత్రం పరుగుల వరద పారిస్తున్నాడు అని చెప్పాలి. ఏకంగా సీనియర్ బౌలర్లను సైతం ఉతికి ఆరేస్తూ ఉన్నాడు. స్కోర్ బోర్డును సైతం పరుగులు పెట్టించి అలసిపోయేలా చేస్తున్నాడు.  అటు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాగే విధ్వంసం సృష్టించాడు. అప్పటికే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోకి కష్టాల్లో కూరుకుపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దీంతో సన్రైజర్స్ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్ అయినా చేస్తుందో లేదా అని అభిమానులే అనుమానపడ్డారు.

 ఇలాంటి సమయంలో అటు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు 42 బంతుల్లోనే 8 సిక్సర్లు మూడు ఫోర్ల సహాయంతో 76 అడుగులు సాధించాడు. ఇక అతని విధ్వంసంతో సన్రైజర్స్ జట్టు 200కు పైగా పరుగులు చేయగలిగింది. అయితే నితీష్ కుమార్ సిక్సర్ల విషయంలో ఒక అరుదైన రికార్డు కూడా సృష్టించాడు. 20 ఏళ్లలోపు ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ప్లేయర్గా నిలిచాడు. 2017లో రిషబ్ పంత్ గుజరాత్ లయన్స్ పై అత్యధికంగా ఓకే ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు బాదాడు. ఇక ఇటీవల రాజస్థాన్ ఫై నితీష్ కుమార్ 8 సిక్సర్లు బాది అరుదైన రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: