శ్రీదేవితో కారులో షికారు చేస్తున్న ఆర్జీవీ..!!

murali krishna
స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం తన వింత వింత సినిమాలతో కొంతమందికి విసుగు తెప్పిస్తున్నారు. అప్పట్లో ఈయన కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది.ఒకప్పుడు ఎంత మంచి సినిమాలు తీసి ప్రశంసలు అందుకున్నాడో.. ఇప్పుడు చెత్త చెత్త సినిమాలు తీసి విమర్శలు అందుకుంటున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెల్సిందే. ఇష్టం అని చెప్పడం కన్నా ఆమెకు వర్మ భక్తుడు అని చెప్పొచ్చు. ఆమె అందానికి వర్మ బానిస. ఈ విషయాన్ని ఆర్జీవీ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు కూడా.వర్మ దర్శకత్వంలో శ్రీదేవి రెండు సినిమాల్లో నటించింది. గోవిందా గోవిందా, క్షణ క్షణం. రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. 2018 లో శ్రీదేవి మరణించింది. ఆరోజు ఎంతమంది ఎలా ఏడ్చారో తెలియదు కానీ, వర్మ మాత్రం పిచ్చివాడైపోయినట్లు తెలిపాడు. ఆమె స్వర్గంలో రంభ ఊర్వశి మేనక పక్కన ఉండి ఉంటుందని, మళ్లీ భూమిపైకి రావాలని మందుకొడుతూ ఎన్నో  పోస్ట్లు   కూడా చేశాడు. అప్పుడే కాదు సమయం చిక్కినప్పుడల్లా.. వర్మ, శ్రీదేవిని తలుస్తూనే ఉంటాడు.అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ, చనిపోయిన శ్రీదేవితో కారులో హాయిగా షికారు చేస్తున్నట్లు ఓ ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో శ్రీదేవి వర్మ పక్కన కూర్చొని డ్రైవింగ్ చేస్తుంటే.. ఆయన సిగరేట్ తాగుతూ కనిపించాడు. ఇక ఆ ఫొటోకు క్యాప్షన్ ఇస్తూ.. శ్రీదేవిని చూడటానికి స్వర్గానికి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్స్ వర్మ నువ్వు ఏం చేస్తున్నావ్ అసలు.. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక దీనికి ఆమెను చూడడానికి స్వర్గానికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. చనిపోయిన శ్రీదేవితో ఏంటా పనులు వర్మ.. ? అని కొందరు.. శ్రీదేవి పక్కన ఇంత గ్లామరస్ గా ఉన్న హీరో ఎవరు అని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: