రాజకీయ నాయకులను వణికిస్తున్న క్రాస్ ఓటింగ్?

Purushottham Vinay

•నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న క్రాస్ ఓటింగ్
•కొందరికి ఫేవర్ అయితే కొందరికి కొంపలు అంటుకుపోతున్నాయి

ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: ఎన్నికలు సజావుగా ముగిశాయి. రిజల్ట్స్ జూన్ లో రానున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఇండియా హెరాల్డ్ చేసిన సర్వేలో తేలింది. దీంతో పలు నేతల కంటి మీద కునుకు లేకుండా పోయింది. టెన్షన్ తో వణుకుతున్నారు.అసెంబ్లీకి ఒక గుర్తుపైన ఓటు వేసిన వారు పార్లమెంటుకు వచ్చేసరికి మరో గుర్తు వేశారని తెలుస్తుంది. ఇండియా హెరాల్డ్ చేసిన సర్వేలో పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తల నుంచి వచ్చిన సమాచారంతో క్రాస్ ఓటింగ్ అనేది భారీగా జరిగిందని తేలింది.

ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం తెలిసింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కూటమి తరుపు నుంచి మూడు పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగారు.మూడు గుర్తులని ఓటర్లకు చెప్పడానికి నేతలు చాలా రకాలుగా కష్టపడాల్సి వచ్చింది. ఇంటింటి ప్రచారంలో కూడా ఎవరికి వారే తమ గుర్తును ప్రచారం చేసుకుని వెళ్లారు. మూడు గుర్తులు చెబితే ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురవుతారని భావించి మూడు పార్టీలూ కూడా ఒక గుర్తు ను మాత్రమే ప్రచారం చేసుకొని వెళ్లిపోవడం జరిగింది.అయితే కొన్ని చోట్ల ఓటర్లు రెండు గుర్తులకు ఓటు వేయాల్సి వచ్చింది.ఇది ప్రాబ్లెమ్ అయ్యింది.

కాకినాడ పార్లమెంటుకు జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేయగా, ఇక రాజమండ్రి పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. అంటే ఈ పార్లమెంటు పరిధిలోని శాసనసభ నియోజవర్గాలు రెండు గుర్తులను గుర్తుపెట్టుకుని మరీ ఓటువేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఓటర్లు తాము ఆ గుర్తుకు వేయలేదని చెబుతుండటంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తుంది. గతంలో కాకినాడ పార్లమెంటు పరిధిలో వైసీపీ తరపున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ మూడు సార్లు వివిధ పార్టీల నుంచి ఓటమి పాలయి కొంత సింపతీని కూడగట్టుకున్నారంటున్నారు. ఆయన చాలా మందికి ఉపాధి కూడా తన సంస్థల్లో కల్పించడంతో పాటు ప్రత్యర్థి కొత్తవాడు కావడంతో జనం అటు వైపు మొగ్గు చూపారని తెలిసింది. అందుకే కాకినాడ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గం పరిధిలో ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తుంది.దీంతో వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలిచినట్లేనని పెద్దయెత్తున బెట్టింగ్ లు పైగా కూటమిలోని ఒక పార్టీకి చెందిన వారే కడుతుండటంతో అనుమానం ఇంకా గట్టిపడింది.

ఇంకా అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ చేసిన రాజమండ్రి స్థానంలో కొన్ని వైసీపీ ఓటు బ్యాంకు నుంచి కూడా ఆమెకు పడినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కూతురుగానే కాకుండా మహిళ కావడంతో ఎక్కువ మంది మహిళలు అసెంబ్లీకి వైసీపీకి ఓటు వేసిన వారు కూడా పార్లమెంటుకు వచ్చేసరికి బీజేపీకి వేశారని తెలుస్తుంది. అయితే వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కూడా మంచి పేరున్న వ్యక్తి.ఆయన అందరికీ సుపరిచితుడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయనకు చాలా మంచి పేరుంది. అందుకే డాక్టర్ కు కాదని బీజేపీకి ఓటు వేయకుండా టీడీపీ సపోర్టర్స్ కూడా బటన్ ప్రెస్ చేయరని తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ క్రాస్ ఓటింగ్ గురించి చర్చ తీవ్రంగా సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: