బన్నీ ఫ్యాన్స్ కు షాక్.. పుష్ప 2 మూవీ వాయిదా..??

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వరుస షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జనసైనికుల ఆగ్రహానికి గురైన బన్నీకి.. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప 2' కూడా ఒకటి. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ క్రేజీ పాన్ ఇండియా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇప్పుడు పుష్ప 2 సినిమా మరో కొత్త చిక్కును తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది.దీని కారణంగా పుష్ప 2 సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.స్టార్ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా పుష్ప 2: ది రూల్. ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సన్సేషనల్ అవుతోంది. పుష్ప సినిమా సాధించిన విజయంతో పాన్ ఇండియా స్థాయిలో పుష్పరాజ్ పేరు మారుమోగిపోయింది.
తాజాగా ఈ చిత్రంలో నటిస్తోన్న అనసూయ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో బన్నీకి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చెక్కెర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే టాక్ నడుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ చేస్తామని ప్రకటించగా అది కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ఈ మూవీకి ఎడిటర్ గా పనిచేస్తున్న ఆంటోని రూబెన్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. డేట్స్ విషయంలో సమస్యలు కారణంగా ఆంటోని ఎడిటర్ గా తప్పుకున్నాడని సినీ వర్గాల్లో చర్చ. అతని స్థానంలో కొత్త ఎడిటర్ గా నవీన్ నూలిని ఎంపిక చేసినట్లు టాక్. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో చెక్కెర్లు కొడుతుండడంతో పుష్ప 2 వాయిదా పడుతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.కాగా ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల కారణంగా కల్కి లాంటి భారీ లు తమ విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు పుష్ప 2 కూడా అదే దారిలో పయనిస్తోందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆగస్ట్ 15 తేదీని 'పుష్ప 2' టీమ్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదని ఫ్యాన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: