ఏపీ : ఎన్నికల ఫలితాలకు ముందే చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ సారి ఎన్నడూ లేనంత గా పోలింగ్ శాతం పెరిగింది.. దీనితో ఎన్నికలలో గెలుపుపై ఇరు పార్టీలు ఎంతో ధీమాగా వున్నాయి.. ఈ సారి మునుపు కంటే మరిన్ని సీట్లు సాధించి అధికారం చేపడతామని వైసీపీ నేత జగన్ తెలిపారు. దీనితో ఈ సారి విజయం వైసీపీదే  అని వైసీపీ కార్యకర్తలు ఎంతో ధీమాగా వున్నారు.అలాగే రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ఎంతో ధీమాగా వున్నారు..అయితే ఇదే సమయంలో   తెలుగుదేశం పార్టీ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే మహానాడు వాయిదా పడింది. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28వ తేదీ కలిసి వచ్చేలా ప్రతి సంవత్సరం టీడీపీ రెండు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తుంది.అయితే ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగడంతో  మహానాడు నిర్వహణకు సరైన సమయం లేకపోవడంతో వాయిదా వేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 

మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే ఫలితం తేలకముందే మహానాడు నిర్వహించడం సరికాదన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే మహానాడు వాయిదాకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలకనిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మహానాడు వాయిదా విషయం వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా మహానాడు వాయిదా వేయక తప్పడం లేదని వారు పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ జయంతి నాడు మహానాడు నిర్వహించకపోయినప్పటికీ కూడా మే 28న గ్రామాల్లో, పట్టణాల్లో ఎన్టీఆర్‌కు నివాళి, అలాగే టీడీపీ పార్టీ జెండాను ప్రతి ఊరిలో ఎగురవేయడం, రక్తదాన శిబిరాలు అలాగే అన్నదానం వంటి పనులు యథావిథిగా నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: