పార్టీ కోసం ఒకరు.. పార్టీ మారి ఇంకొకరు.. ఇంతకి ఈ మహిళామణుల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే?

praveen
ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి నెలకొంది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది మహిళా మణులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరనారుల్లాగా ఏకంగా ప్రజల్లోకి వెళ్లి గెలపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తో పాటు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత కూడా ఒకరు అని చెప్పాలి. ఒకరూ పార్టీ మారి విజయం కోసం పోరాడుతుంటే.. పార్టీ కోసం పార్టీకి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించడం కోసం మరొకరు వీరనారీలా పోరాడుతున్నారు.

 బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. అయితే 2018 నుంచి కూడా తన కూతురు కడియం కావ్యకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోవాలని ఎంతగానో ప్రయత్నించారు కడియం శ్రీహరి. కానీ 2018 లో కెసిఆర్ ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదు.  2023లో తాను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను తప్పుకొని కూతురిని నిలబెట్టాలి అని అనుకున్నారు. కానీ కెసిఆర్ మాత్రం కడియం కూతురుకి కాకుండా మరోసారి కడియం కే అవకాశం ఇచ్చారు.

 చివరికి ఎంపీ ఎలక్షన్ సమయంలో కూతురికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతాను అంటూ కడియం హెచ్చరించడంతో.. ఇక కెసిఆర్ కడియం పార్టీ మారకముందే ఆయన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించారు. అయినప్పటికీ కడియం శ్రీహరి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కూతురుతో కలిసి బిఆర్ఎస్ను వదిలి హస్తం పార్టీలోకి వెళ్లారు. ఇక హస్తం పార్టీలోకి వెళ్లి అక్కడ కూతురుకి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు కడియం కావ్య తండ్రి మద్దతుతో ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

 ఇక హైదరాబాద్ బిజెపి అభ్యర్థి కొంపల్లి మాధవి లత అప్పటివరకు ఏ పార్టీలో లేరు. కానీ హిందుత్వ భావజాలంతో ఇక ఎన్నో ప్రసంగాలు ఇచ్చి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించారు. దీంతో బీజేపీ తరఫున హైదరాబాద్ ఎంపీ టికెట్ను దక్కించుకున్నారు. ఈమె విరించి హాస్పిటల్స్ అధినేత అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు రాజకీయ ఉద్దండులకు సైతం హైదరాబాద్లో ఎంఐఎం కంచుకోటను   బద్దలు కొట్టడం సాధ్యం కాలేదు. కానీ మాధవి లత ఏకంగా ఓవైసీకి షాక్ ఇచ్చేలాగాగే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంతలా అంటే ఇప్పటివరకు కనీసం ఎన్నికల ప్రచారాల్లో పాటల జోలికి వెళ్ళని ఓవైసీ.. తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు తెలుగు పాటలను పెట్టుకుని ప్రచారం నిర్వహించేంతగా ఓవైసీ ని మాధవి లత భయపడుతున్నారు. ప్రజలకు స్పష్టమైన హామీలు ముందుకు సాగుతున్నారు. ఇలా ఏకంగా హైదరాబాదులో గెలిచి  పార్టీ ప్రతిష్టను నిలబెట్టడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు మాధవి లత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: