దూబేని వరల్డ్ కప్ లోకి సెలెక్ట్ చేయడానికి.. కారణం అదే : రోహిత్

praveen
ప్రస్తుతం ఐపీఎల్ టోర్ని హోరాహోరీగా జరుగుతుంది. ప్లే ఆఫ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక పోరు మరింత రసవతంగా మారిపోయింది. అన్ని జట్లు కూడా విజయం సాధించి ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. కాగా ఐపీఎల్ టోర్నిలో ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఒక రూల్ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రూల్ ను అటు అన్ని టీమ్స్ ఎంతో బాగా వినియోగించుకుంటున్నారు.

కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అటు అల్ రౌండర్లకు పెద్ద మైనస్ గా మారిపోయింది. కేవలం జట్టులోని ఆల్రౌండ్లను బ్యాటింగ్ కోసం మాత్రమే వినియోగించుకుంటున్నారూ. బౌలింగ్ కోసం ఆల్ రౌండర్లు పక్కనపెట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో స్పెషలిస్ట్ బౌలర్ ని జట్టులోకి తీసుకుంటున్నారూ. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ శివం దూబే విషయంలో కూడా ఇదే జరిగింది. అతను బ్యాటింగ్లో అదరగొడుతున్నారు. ప్రతి మ్యాచ్లో కూడా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అతను బౌలింగ్ చేయలేదు. దీంతో అతనికి వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందో లేదో అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి.

 కానీ ఇటీవల బీసీసీఐ టి20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో మాత్రం శివం దూబేకి ఛాన్స్ దక్కింది  అయితే ఇలా అతనికి వరల్డ్ కప్ టీంలో ఛాన్స్ ఎందుకు ఇచ్చారూ అనే విషయంపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భయం లేకుండా ఆడతాడు. కాబట్టి అతన్ని వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నాం అంటూ కెప్టెన్ రోహిత్ తెలిపారు. మిడిల్ ఆర్డర్లో భయం లేకుండా షాట్లు ఆడే ప్లేయర్ కోసం చూసాం. అందుకే శివం దూబేని సెలెక్ట్ చేసాం. కానీ దురదృష్టవశాత్తు అతడికి ఐపీఎల్లో బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా, దుబే బౌలింగ్ చేస్తారని ఆశిస్తున్నాం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: