జగన్‌కు అడ్డంగా దొరికిపోయిన బాబు, మోదీ.. ఆడేసుకుంటున్నాడుగా?

ఏపీ రాజకీయ చదరంగంలో టీడీపీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది బీజేపీ. దేశ వ్యాప్తంగా  మోదీ గ్యారంటీ అంటూ హామీలు ప్రకటిస్తున్న బీజేపీ.. ఏపీలో మాత్రం టీడీపీ,జనసేన హామీలకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితులు స్పష్టంగా ఉండటం.. టీడీపీ జనసేన అడ్డగోలు హామీలకు ఓకే చెబితే.. తమకు చెడ్డ పేరు వస్తోందనే ఉద్దేశంతో కమలనాథులు జాగ్రత్త పడుతున్నారు.

ఇన్నాళ్లూ వైసీపీ పథకాలను విమర్శించిన టీడీపీ, జనసేనలు, ఇప్పుడు అవే పథకాలకు పేరు మార్చి అమలు చేస్తామని చెప్పడం.. ఆ పథకాలకు నిధులు ఎలా సమకూరుస్తుందో చెప్పకపోవడం గమనిస్తున్న బీజేపీ నేతలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించిన హామీల్లో అమలు చేయని వాటికి బీజేపీ బాధ్యత వహించాలని సీఎం  జగన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మ్యానిఫెస్టోతో తమకు ఏం సంబంధం లేదని చెప్పడం బీజీపీ వ్యూహం కావొచ్చు.

ఇదిలా ఉండగా.. టీడీపీ, జనసేన మ్యానిఫెస్టోపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. కూటమి మ్యానిఫెస్టోపై ఎందుకు ప్రధాని మోదీ ఫొటో లేదో తెలుసా అంటూ ప్రశ్నించారు. కూటమి మ్యానిఫెస్టోలో ముగ్గురి ఫొటోలు పెట్టే పరిస్థితి లేదు. అమలకు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు కాబట్టే బీజేపీ ఈ మ్యానిఫెస్టోకి ఓకే చెప్పలేదు. చంద్రబాబు ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో ప్రజలు గమనించాలి అంటూ సీఎం జగన్ విమర్శలు సంధిస్తున్నారు.
 
మేం అమలు చేస్తున్న పథకాలకే ఏటా రూ.70వేల కోట్లు అవసరం అవుతాయి. అదే చంద్రబాబు చెప్పినవి చేయాలంటే రూ.1.50లక్షల కోట్లు కావాలి.  ఇవి సాధ్యం కాదు కాబట్టే బీజేపీ నేతలు, ప్రధాని మోదీ ఈ మ్యానిఫెస్టోకి ఒప్పుకోలేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. హామీల మోసం ఏ స్థాయిలో ఉందో అంటూ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని సీఎం జగన్ టీడీపీ పై విమర్శలు సంధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: