కుక్క చేసిన పనికి.. యజమానికి రూ.3 లక్షల నష్టం?

praveen
సాధారణంగా ఎన్నో దశాబ్దాల నుంచి కుక్కలకి మనుషులకి మధ్య బంధం కొనసాగుతూనే వస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక విశ్వాసానికి మారుపేరుగా పిలుచుకునే శునకాలను పెంచుకోవడానికి మనుషులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఇంటిదగ్గర కాపలాగా ఉంటుందని మాత్రమే అటు కుక్కను పెంచుకునేవారు. కానీ ఇటీవల కాలంలో కుక్కను పెంచుకోవడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఇలాంటి ట్రెండ్ ను ఫాలో అవ్వడానికి ప్రతి ఒక్కరు ఇష్టమైన బ్రీడ్ ను తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవడం చేస్తున్నారు. ఇక ఇంట్లోమనిషి లాగానే కుక్కలపై కూడా ప్రేమలు చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 కొంతమంది జంతు ప్రేమికులు అయితే కుక్కలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా మనుషులకు ఇవ్వడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అది సరే గాని ఇప్పుడు పెంపుడు కుక్కల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.. సాధారణంగా ఎవరైనా పెంపుడు కుక్కని పెంచుకుంటే ఇక అది తమకు విశ్వాసంగా ఉంటుందని ఇక కొన్ని పనులు కూడా చేసి పెడుతుంది అంటూ చెబుతారు యజమానులు. కానీ ఇక్కడ పెంపును కుక్కడు పెంచుకోవడం ఏకంగా యజమానికి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. పెంపుడు కుక్క చేసిన పనికి యజమానికి మూడు లక్షల నష్టం వాటిల్లింది.

 ఆకలితో ఉన్న ఒక పెంపుడు కుక్క తన యజమానికి షాక్ ఇచ్చింది. 4వేల డాలర్లను హామ్ ఫట్ అంటూ తినేసింది అంటే భారత కరెన్సీలో మూడు లక్షల రూపాయలు. పెన్సిల్వేనియాలో ఉండే పీటర్ అనే వ్యక్తి తన ఇంట్లో గోల్డెన్ డూడల్ రకం కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే సెంతిల్ అనే ఆ కుక్క ఒకరోజు ఆకలితో కాంట్రాక్టర్కు ఇవ్వడానికి కవర్లో దాచిన నగదును తినేసింది. కానీ అది అరగకపోవడంతో మళ్లీ ఆ నోట్లను మొత్తం ఆ కుక్క కక్కేసింది. దీంతో చిరిగిన నోట్లనూ మళ్ళీ అతికించేందుకు ప్రయత్నించిన.. ఇకమొత్తం అతను రికవరీ చేసుకోలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

God

సంబంధిత వార్తలు: