దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు మరియు ప్రకాష్ కోవెలమూడి భార్య కనిక థిల్లాన్ (ఇప్పుడు విడిపోయారనుకోండి) బాలీవుడ్లో కొంచెం పేరున్న స్క్రీన్ ప్లే రైటరే. అసిస్టెంటు డైరెక్టరుగా, స్క్రిప్ట్ రైటర్‌గా షారుఖ్ ఖాన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో ఆమె చాలా కాలం పని చేసింది. బయటి సినిమాలకు కూడా స్క్రీన్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన వీళ్లు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లే. కనిక థిల్లాన్ కథలు రాస్తున్నప్పుడు ఓ కామన్ ఫెండ్గా ప్రకాష్ పరిచడం అయ్యాడు.
అయితే ఆమె కథలకు సరైన ఫీడ్ బ్యాక్ ఇస్తూ పరిచయం పెంచుకున్నారు. అంత పెద్ద రొమాంటిక్ లవ్ స్టోరీ కాకపోయినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కలిసి బతకాలని అనుకుని వివాహం చేసుకున్నారు. 2014లో వివాహం చేసుకున్న వీరు ఆ తర్వాత కలిసి జీవించలేమని నిశ్చయించుకుని విడిపోయారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఇలా కలవడం.. అలా విడిపోవడం కామన్ విషయమే. ఆమె తెలుగులో ప్రకాష్ డైరెక్ట్ చేసిన ‘సైజ్ జీరో’కు కథ అందించింది. ప్రస్తుతం ప్రకాష్ డైరెక్ట్ చేస్తున్న బాలీవుడ్ మూవీ ‘మెంటల్ హై క్యా’కు కూడా కనికనే స్క్రీన్ ప్లే రాసింది.
కానీ వీరిద్దరూ ఈ సినిమా ప్రారంభానికి ముందే విడిపోయి, విడాకులు తీసుకున్నారు. అయినా కలిసి పని చేసి ఎక్కడా చిన్న తేడా రాకుండా చూసుకున్నారు. ఎందుకు విడిపోయారో కారణాలు చెప్పకపోయినా ఇప్పుడు స్నేహితులుగా కలిపి పని చేస్తున్నారు. వారి వైవాహిక జీవితం గురించి ప్రకాష్ జస్ట్ అలా జరిగిపోయింది.. విడిపోయాం. ప్రస్తుతం మంచి స్నేహితులుగా ఉంటున్నాం అని అంటాడు. కనిక ఇందులో చెప్పుకోవడానికి ఏమి లేదు. ఎప్పుడో ఆ ఇంటిని వదిలేశాను. ఎంత సేపు ఈ ప్రశ్నలేనా? తన ప్రొఫిషన్ గురించి అడగవచ్చుగా అని సింపుల్‌గా తేల్చేస్తుంది.