ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా టెక్నిషియన్స్ కు. ఎన్టీఆర్ తో సినిమా చేస్తే... వారికి మరో పది సినిమాల్లో అవకాశాలు వస్తుంటాయి. కారణం ఏంటి అంటే.. ఎన్టీఆర్ నటన. ఆ నటనను కెమెరాలో బంధించేందుకు సినిమాటోగ్రాఫర్స్ ఆసక్తి చూపిస్తుంటారు.
అయితే, ఓ యువ సినిమాటోగ్రాఫర్ కు ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ తృటిలో కోల్పోయాడట. స్వామిరారా సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రిచర్డ్ ప్రసాద్... ఆ సినిమా మంచి హిట్ కొట్టడంతో.. కొత్తజంట సినిమా చేసే అవకాశం వచ్చింది.
కొత్తజంట సినిమా ఎలా ఉన్నా ఫొటోగ్రఫీ బాగుంటుంది. అందుకే సినిమాకు పిచ్చ డబ్బులు వచ్చాయి. దీనితరువాత దోచెయ్, బాబు బంగారం సినిమాలు చేశారు. ఏ రెండు ఫెయిల్ అయినా.. ఫొటోగ్రఫీకి పేరు వచ్చింది. అదే సమయంలో సుకుమార్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నారు.
దానిని మొదట రిచర్డ్ ప్రసాద్ ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారు. అయితే వీసా ప్రాబ్లెమ్ కారణంగా ఆ సినిమా చేసే అవకాశం మిస్ అయినట్టు రిచర్డ్ ప్రసాద్ పేర్కొన్నాడు. అయన సినిమాటోగ్రఫీ అందించిన ఓ బేబీ సినిమా సూపర్ హిట్టైన సంగతి తెల్సిందే. ప్రస్తుతం చేతిలో నాలుగైదు మంచి ప్రాజెక్టులు ఉన్నాయట.