పవన్ విధ్యా అర్హతల పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు !

Seetha Sailaja
నటుడు శివాజీ పవన్ కళ్యాణ్ విధ్యా అర్హతల పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారడమే కాకుండా పవన్ అభిమానులకు విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. 9వ తరగతి వరకు మాత్రమే చదువుకుని ఆతరువాత 10వ క్లాస్ పరీక్షలలో ఫెయిల్ అయిన పవన్ ముఖ్యమంత్రి అయితే ఐఏఎస్ లను ఐపీస్ లను ఎలా కంట్రోల్ చేస్తారో తనకు తెలియడం లేదు అంటూ సెటైర్లు విసిరాడు.

లక్షలు ఖర్చు చేసి కష్టపడి చదువుకునే కంటే చదువులేకపోయినా మంత్రులు అయిపోవచ్చు అన్న సంకేతాలు వస్తే ఇక పిల్లలు చదువులు చదవరు అంటూ మరొక సెటైర్ వేసాడు శివాజీ. ప్రస్తుతం శివాజీ కామెంట్స్ జనసైనికులలో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. దీనితో రానున్న ఎన్నికలలో శివాజీని ఒక అస్త్రంగా మార్చుకుని తెలుగుదేశం పవన్ ను ఇరుకున పెట్టె కామెంట్స్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది అన్న విషయం పై ఊహాగానాలు మొదలు అయ్యాయి.

ఇది ఇలా ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ తన దూకుడును మరింత పెంచి రాబోతున్న ఎన్నికలలో ఎన్నికల అభ్యర్దుల ఎంపికకు సంబంధించి పోతీచేయబోయే అభ్యర్ధుల నుండి దరఖాస్తులు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ సందర్భంలో పవన్ తన పార్టీ సన్నిహితులతో అభ్యర్ధుల నుండి సేకరించవలసిన దరఖాస్తు నమూనా పరిశీలన ప్రక్రియ గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈవిషయమై పవన్ ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి ‘జనసేన’ పార్టీ కార్యాలయంలో అభ్యర్ధుల నుండి దరకాస్తులు స్వీకరించే కార్యక్రమం నిన్నటి నుంచి మొదలు పెడుతూ తొలి దరఖాస్తుగా తన బయోడేటాను ఇవ్వడంతో పవన్ ఏ నియోజక వర్గం నుండి పోటీ చేయబోతున్నాడు అన్న ఆసక్తి వివరీతంగా పెరిగిపోయింది. దీనితో తన పై ఎవరు ఎన్ని ఘాటైన విమర్శలు చేసినా వాటిని పట్టించు కోకుండా పవన్ సందర్భానుసారంగా తన వ్యూహాలు మారుస్తూ ప్రముఖ రాజకీయ పార్టీలు అన్నింటికీ టెన్షన్ పెంచుతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: