మరోసారి తన మంచి మనసు చాటుకున్న యాంకర్ సుమ

siri Madhukar
తెలుగు టివి ప్రేక్షకులకు యాంకర్ సుమ అంటే ఎంతగానో అభిమానిస్తారు.   పుట్టింది కేరళా అయినా..తెలుగు భాషపై ఆమెకు ఉన్న పట్టు చూసి యావత్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.  అందుకే స్టార్ హీరోల సినిమాలు సుమ యాంకరింగ్ తోనే మొదలు పెడతారు.  వెరైటీ షోస్‌తో ఆక‌ట్టుకుంటున్న సుమ తాజాగా మంచి మ‌న‌సు చాటుకుంది.  టెలివిజన్ రంగంలో మహరాణిగా వెలిగిపోతుంది యాంకర్ సుమ.  టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  అప్పుడప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తుంది. 

బుల్లితెరపై ఎంత స్టార్ ఇమేజ్ ఉందో..సామాజిక సేవలో కూడా ఈ దంపుతులు అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు.  ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ..ప్రకృతి వైపరిత్యాల వల్ల ఇబ్బందుల పడే వారికి తమ స్థాయికి తగ్గట్టు విరాళాలు ఇస్తుంటారు.  ఆ మద్య కేరళాలలో వర్షాల కారణంగా అతలాకుతలం అయ్యింది. ఆ సమయంలో ఓ ఆసుపత్రిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 

తాజాగా సుమ మరోసారి తన మంచి మనసు చాటుకుంది.  ఇటీవ‌ల తిత్లీ దాటికి ఎంద‌రో నిరాశ్ర‌యిల‌య్యారు. ఓ వృద్ధ కుటుంబం ఇల్లు లేక రోడ్డున ప‌డింది. ఈ విష‌యం త‌న డ్రైవ‌ర్‌ ద్వారా తెలుసుకున్న సుమ వారికి విరాళ‌మిచ్చి అంత‌టితో వదిలేయ‌కుండా, త‌న మ‌నుషులని ద‌గ్గ‌ర పెట్టి ఇల్లు క‌ట్టిస్తుంది.  ఆ ఇంటిని పూర్తి చేసి ఆమె కుటుంబాన్ని ఆదుకోవడం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.  ఇల్లు నిర్మాణం తుది ద‌శ‌కు చేరుకోగా, ప‌నుల‌న్నింటిని సుమ‌కి సంబంధించిన వారు చూసుకుంటుండ‌డం విశేషం. 

అంతే కాదు పంట నష్టం వల్ల కష్టాలు పడుతున్న కొంత మంది రైతులను కూడా తన చేతనైన సహాయం అందిస్తానంటుంది యాంకర్ సుమ. అలిప్పిలో వరద బాధితులను సైతం ఆమె ఆదుకున్నారు. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను సుమ చేస్తున్న మంచి ప‌నులు ఎంద‌రికో ఆద‌ర్శ‌వంతంగా ఉంటాయ‌ని చెబుతున్నారు.



Took up this family's home in Srikakulam after the flood https://t.co/BPGHxFHTpL in progress .their home being rebuilt. pic.twitter.com/6FKw6vkeVT

— Suma Kanakala (@ItsSumaKanakala) November 21, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: