బాలకృష్ణకు నటించడం రాదు-బ్రాహ్మణి వ్యాఖ్యలు !

Seetha Sailaja
నందమూరి సింహం బాలకృష్ణ కుమార్తెగా ఆంద్రప్రదేశ్ ముఖ్యంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలుగా మంత్రి నారా లోకేష్ సతీమణిగా త్రిపాత్రాభినయం చేస్తున్న బ్రాహ్మణి తన తండ్రి బాలయ్యకు జీవితంలో నటించడం రాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాహ్మణి ఈ కామెంట్స్ చేసింది. 

తన తండ్రి టాప్ హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించినా తన తండ్రికి డిప్లమాటిక్ గా ఉండటం జీవితంలో నటించడం చేతకాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తండ్రికి చాలకోపం ఎక్కువ అని చాలామంది అంటూ ఉంటారని బయటకు అలా కనిపించినా తన తండ్రిలోని చిన్న పిల్లవాడి మనస్తత్వం చాలామందికి తెలియదు అని అంటూ బాలయ్య గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది బ్రాహ్మణి. 

ఎప్పుడు సింపుల్ గా ఉండాలి అని చెప్పే తమ తండ్రి బాలకృష్ణ తమ చిన్నప్పటి నుండీ ఖరీదైన వస్తువులకు దుస్తులకు దూరంగా ఉంచిన విషయాలను గుర్తుకు చేసుకుంది. ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా జనం అభిమానం లేకుంటే ఎవరు గుర్తిస్తారు అంటూ తన తండ్రి బాలయ్య సింపుల్ గా జీవించడంలోని ఆనందాన్ని తెలియ చేసాడు అని అంటోంది నారా వారి కోడలు. 

తన తండ్రి బాలకృష్ణకు 58 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా చాల ఎనర్జిటిక్ గా ఉంటాడు అని చెపుతూ తన కొడుకు దేవాన్ష్ లోని ఎనర్జీ కంటే తన తండ్రి బాలకృష్ణ ఎనర్జీ చాల ఎక్కువ అని అంటూ తన తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటోంది. ఇక తన తాత నందమూరి తారకరామారావు బయోపిక్ లో నటిస్తున్న తన తండ్రి బాలయ్యను చూసి తాను గర్వంగా ఫీల్ అవుతున్నానని అటువంటి తండ్రికి కూతురుగా పుట్టడం తన అదృష్టం అంటూ బాలయ్య పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది బ్రాహ్మణి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: