మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా సోలో హీరోగా వినయ విధేయ రామ అనే సినిమాలో నటించాడు. భారీ అంచనాల నడుమ 2019 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ తర్వాత చరణ్ "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య మూవీ లో చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు.
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత చరణ్ సోలో హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. విడుదల 24 గంటల్లో ఈ మూవీ ట్రైలర్ కు 36.24 మిలియన్ వ్యూస్ , 5:41 లైక్స్ లభించాయి.
ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమ నుండి విడుదల అయిన ట్రైలర్లలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 3 ట్రైలర్ గా గేమ్ చేంజర్ ట్రైలర్ నిలిచింది. ఈ మూవీ కంటే ముందు అత్యధిక వ్యూస్ తో పుష్ప పార్ట్ 2 , గుంటూరు కారం ట్రైలర్స్ ఉన్నాయి.