ఇవేం డ్యాన్స్‌లు రా బాబు .. తీరు మారకపోతే రాబోయే రోజుల్లో వారికి కష్టమే..!

Amruth kumar
ప్రజెంట్ టాలీవుడ్ సినిమాల్లో డాన్స్ కొరియోగ్రఫీ పై విపరీతమైన చర్చ విమర్శలు వస్తున్నాయి .. ప్రధానంగా సినిమాలు గ్లోబల్ స్థాయికి వెళ్ళాక స్టార్ హీరోల డాన్సులపై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి . అయితే సినిమా గ్లోబల్ స్థాయికి వెళ్లాక కొరియోగ్రఫీ లోను మార్పులు వచ్చాయి . కానీ దిగజారిపోయిన మార్పులే తీవ్ర సమస్యగా మారాయి . ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన నట‌సింహం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలోని ఓ పాట మరోసారి ఈ చర్చకు దారి తీసింది. ఇంతకీ ఈ విషయంలో ఏం జరుగుతుందంటే.

ఇక గత సంవత్సరం హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో 'సితార్' సాంగ్లో రవితేజ హీరోయిన్  పాకెట్స్ లో చేతులు పెట్టడం నడుము పై కొట్టడం లాంటి మూమెంట్స్ పై నెటిజన్లు  తీవ్ర అభ్యంతరం చెప్పారు . అలాగే హీరో కంటే హీరోయిన్ వయసు సగం తక్కువ ఉండటం కూడా ఇక్కడ కోసమేరుపు . గత నెలలో రిలీజ్ అయిన పుష్ప 2 మూవీలోని ఫీలింగ్స్‌ సాంగ్ లో డాన్సులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి .. ప్రధానంగా రష్మిక ఇచ్చిన కొన్ని డాన్స్ మూమెంట్స్ ఆశ్లీలంగా ఉన్నయనే చర్చ కూడా వచ్చింది.

ఇక‌ ఇప్పుడు తాజాగా వచ్చిన దబిడి దిబిడే అంటూ డాకు మహారాజ్ సినిమాలోని పాటపై కూడా కొరియోగ్రఫీ పై పలు విమర్శలు వస్తున్నాయి . బాలకృష్ణ ఫేమస్ డైలాగ్స్ తో ఈ పాటను రాసిన విధానం ఆకట్టుకునేలా ఉన్నా ..  ఊర్వశీ రౌతేలా తో బాలకృష్ణ చేస్తున్న కొన్ని నాటు స్టెప్పులకు నెటిజన్స్ నుంచి నెగిటివ్ రియాక్షన్స్ ను తీసుకువస్తున్నాయి. సేమ్ అదే పాకెట్స్ లో చేతులు పెట్టడం నడుము పై కొట్టడం కనీసం పుష్ప 2 సినిమాలో వాళ్ళు ఏజ్ సేమ్.  కానీ.. డాకులో లో హీరోయిన్ వయసు హీరో వయసు కంటే సగం తక్కువ ఈ క్రమంలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి .. అయితే పైన మాట్లాడుతున్న ఈ మూడు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇవ్వటం ఇక్కడ గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: